తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tri Colour Biryani Recipe | మూడు విభిన్న రుచుల సమ్మేళనం.. ట్రై కలర్ బిర్యానీ రెసిపీ ఇదిగో!

Tri Colour Biryani Recipe | మూడు విభిన్న రుచుల సమ్మేళనం.. ట్రై కలర్ బిర్యానీ రెసిపీ ఇదిగో!

HT Telugu Desk HT Telugu

15 August 2023, 13:26 IST

    • Tri Colour Biryani Recipe: స్వాతంత్య దినోత్సవంను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన త్రివర్ణ బిర్యానీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
Tri Colour Biryani Recipe
Tri Colour Biryani Recipe (istock)

Tri Colour Biryani Recipe

Recipe of the day: ఈరోజు భారతదేశం తన 77వ స్వాతంత్య దినోత్సవంను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన త్రివర్ణ బిర్యానీ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. త్రివర్ణ బిర్యానీ అనేది ఒక వెజిటెబుల్ బిర్యానీ అయినప్పటికీ ఇది మూడు విభిన్న రుచుల కలయిక. వివిధ రకాల కూరగాయలను ఉపయోగించి జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మూడు రంగులను ఈ వంటకానికి వచ్చేటట్లు రూపొందించవచ్చు. సాధారణంగా పైన ఆరెంజ్ రైస్ లేయర్, కింద ఆకుపచ్చ రైస్ లేయర్ వేసి మధ్యలో వైట్ రైస్ అలాగే ఉంచడం వలన త్రివర్ణ బిర్యానీని తయారు చేస్తారు. మీరూ ఈ త్రివర్ణ బిర్యానీని తయారు చేయాలనుకుంటే కింద రెసిపీ ఉంది చూడండి.

Tri Colour Biryani Recipe కోసం కావలసినవి

  • 2 కప్పుల బాస్మతి బియ్యం
  • 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి
  • 2 లవంగాలు లవంగాలు
  • 1 అంగుళం దాల్చిన చెక్క
  • 2 ఏలకులు
  • 1 బిరయానీ ఆకు
  • ఉప్పు రుచికి తగినంత

ఆరెంజ్ రైస్ కోసం..

  • 1/4 కప్పు టొమాటో ప్యూరీ
  • 1/4 టీస్పూన్ పసుపు పొడి
  • 1/2 స్పూన్ కారం
  • 1/2 ఎర్ర మిరపకాయ పేస్ట్

వైట్ రైస్ కోసం..

  • 1 కప్పు ఉడికించిన బంగాళాదుంప
  • 2 టీస్పూన్లు పచ్చిమిర్చి
  • 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు
  • 1/2 టీస్పూన్ నూనె

ఆకుపచ్చ రైస్ కోసం..

  • 1/2 కప్పు పాలకూర ప్యూరీ
  • 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
  • 1/4 టీస్పూన్ జీలకర్ర
  • 1 స్పూన్ అల్లం పేస్ట్
  • 1 స్పూన్ పచ్చి మిరపకాయ పేస్ట్

ట్రైకలర్ బిర్యానీ తయారీ విధానం

  1. ముందుగా ఒక బాణాలిలో నెయ్యి వేడి చేసి మసాలా దినుసులు వేయించాలి. ఆపై 4 కప్పుల నీరు, ఉప్పు వేసి అన్నం ఉడికించాలి.
  2. అన్నం ఉడికాక, కాస్త చల్లబడ్డాక మూడు సమాన భాగాలుగా విభజించండి. ఈ మూడు భాగాలను వేర్వేరుగా మూడు రంగులుగా వండాలి.

ట్రైకలర్ బిర్యానీ తయారీ విధానం:

  1. రెండు వేర్వేరు నాన్‌స్టిక్‌ పాన్‌లలో 2 టేబుల్‌స్పూన్ల నెయ్యిని వేడి చేయండి. ఆపైన జీలకర్ర వేసి వేయించండి.
  2. ఇప్పుడు మొదటి పాన్‌లో అల్లం పేస్ట్, కారం, ఎర్ర మిరపకాయ పేస్ట్ వేయండి. టొమాటో ప్యూరీని, ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన అన్నంకు కలుపుకోవాలి. ఆరెంజ్ రంగు లేయర్ సిద్ధమైనట్లే.
  3. వైట్ రైస్ బిర్యానీ కోసం, బాణలిలో నూనె వేడి చేయండి; పచ్చిమిర్చి, బంగాళదుంపలు, ఉప్పు వేసి కలపండి. బంగాళదుంపలు ఉడికేవరకు కొన్ని నిమిషాలు వేయించాలి.
  4. ఈ బంగాళదుంప మిశ్రమాన్ని అన్నంలోని రెండవ భాగానికి కలపండి. బిర్యానీ రైస్‌లో తెల్లని రంగు లేయర్ రెడీ అయినట్లే.
  5. మరో కడాయిలో పైన పేర్కొన్న విధంగానే పాలకూర ప్యూరీ వేసి చేస్తే, ఆకుపచ్చ లేయర్ సిద్ధం అవుతుంది.

ఇప్పుడు అడుగు భాగంలో ఆకుపచ్చ రైస్, మధ్యలో వైట్ బిర్యానీ రైస్, పైన ఆరెంజ్ రైస్ వేసి పేర్చితే త్రివర్ణ బిర్యానీ రెడీ.

తదుపరి వ్యాసం