తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మెరుగైన బ్యాటరీతో Realme C31 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల

మెరుగైన బ్యాటరీతో Realme C31 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల

HT Telugu Desk HT Telugu

31 March 2022, 15:45 IST

    • భారత మార్కెట్లో తాజాగా Realme C31 పేరుతో ఓ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదలయింది. రెండు వేరియంట్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరలు రూ. 9 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.
Realme C31
Realme C31 (Realme)

Realme C31

మొబైల్ తయారీదారు రియల్‌మి తమ బ్రాండ్ నుంచి C-సిరీస్ లో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ Realme C31ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది తక్కువ బడ్జెట్ లో ఉత్తమమైన ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా అందిస్తున్నారు. ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా Realme C31 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3GB RAM /32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999/- కు లభిస్తుండగా, 4GB RAM /64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999/-కు లభిస్తుంది. ఆకుపచ్చ, సిల్వర్ అనే రెండు కలర్ ఛాయిస్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇక మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Realme C31 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

6.5 అంగుళాల IPS LCD HD డిస్‌ప్లే

3/4GB RAM, 32/64GB స్టోరేజ్ సామర్థ్యం (మైక్రో ఎస్డీ కార్డుతో 1TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు)

Unisoc T612 SoC ప్రాసెసర్

వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం

ధర రూ 8,999 నుంచి రూ. 9,999 వరకు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు ఏప్రిల్ 7 మధ్యాహ్నం 12.30 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరుగుతాయి. ఇదేరోజు Realme బ్రాండ్ నుంచి TWS ఇయర్‌బడ్స్‌ అలాగే రియల్‌మి జిటి 2 ప్రో కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

టాపిక్

తదుపరి వ్యాసం