తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raksha Bandhan 2023 Gifts : మీ సోదరి రాశి ప్రకారం.. రాఖీ రోజున ఈ బహుమతి ఇచ్చేయండి

Raksha Bandhan 2023 Gifts : మీ సోదరి రాశి ప్రకారం.. రాఖీ రోజున ఈ బహుమతి ఇచ్చేయండి

HT Telugu Desk HT Telugu

28 August 2023, 8:20 IST

    • Raksha Bandhan 2023 Gifts To Sister : రాఖీ పండగ వచ్చేస్తోంది. అక్కాచెల్లెల్లకు మేం ఉన్నామంటూ అన్నదమ్ములు భరోసా ఇవ్వడమే ఈ పండగ ముఖ్య ఉద్దేశం. మీ సోదరికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా ఆలోచించాలి కదా. ఆమె రాశి ప్రకారం మీరు బహుమతి ఇస్తే అంతా హ్యాపీ. మీ సోదరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలో ఇక్కడ చూడండి.
రాఖి బహుమతి
రాఖి బహుమతి (Unsplash)

రాఖి బహుమతి

రాఖీ అన్నదమ్ములతో అక్కాచెల్లెల్ల బంధాన్ని బలపరిచే పండుగ. రక్షా బంధన్ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టడం ఆనవాయితీ. రాఖీ కట్టిన సోదరికి సోదరుడు ఏదో ఒక బహుమతిని ఇవ్వడం కూడా ఆనవాయితే. మీరు మీ సోదరికి బహుమతి ఇచ్చెప్పుడు ఆమె రాశి ప్రకారం ఇవ్వండి. ఆమెకు అదృష్టవంతురాలు అవుతుంది. ఏ రాశి వారికి ఏ రకమైన బహుమతి మంచిదో చూద్దాం:

మేషం : మీ సోదిరిది మేషరాశి అయితే ఆమెకు చెవిపోగులు, పెండెంట్‌లను బహుమతిగా ఇవ్వవచ్చు. కుజుడు మేష రాశికి అధిపతి కాబట్టి రెడ్ కలర్ డ్రెస్ కూడా ఇవ్వొచ్చు.

వృషభం: వృషభ రాశి సోదరికి వెండి రంగు లేదా తెలుపు బహుమతి ఇవ్వండి. ఈ రంగులు ఆమెకు అదృష్ట రంగు.

మిథునం : మిథునరాశి వారికి ఆకుపచ్చ రంగు బహుమతులు ఇవ్వవచ్చు. క్రిస్టల్ జువెలరీ, గ్రీన్ కలర్ డ్రెస్ వంటివి బహుమతిగా ఇవ్వవచ్చు.

కర్కాటక రాశి : మీ సోదరిది కర్కాటకరాశి అయితే.. మీరు ఏ బహుమతి ఇచ్చినా, దానితో పాటు తెల్లటి డెజర్ట్ కూడా చేర్చండి.

సింహం : మీ సింహరాశి సోదరికి పసుపు లేదా కుంకుమను బహుమతిగా ఎంపిక చేసుకోవడం మంచిది.

కన్యా రాశి : కన్యా రాశి ఉన్న సోదరికి బహుమతులతో పాటు గణేశ విగ్రహాన్ని ఇస్తే, అది ఆమెకు అదృష్టాన్ని కలిగిస్తుంది.

తుల : తులారాశి సోదరికి మీరు సౌందర్య సాధనాలను బహుమతిగా ఇస్తే మంచిది.

వృశ్చికం : వృశ్చికరాశి సోదరి కోసం ఏదైనా మెటల్ నగలు, ఎరుపు రంగు దుస్తులు బహుమతులుగా ఇవ్వవచ్చు.

ధను రాశి : ధనుస్సు రాశి వారికి బంగారు నగలు, పసుపు రంగు దుస్తులు బహుమతిగా ఇవ్వవచ్చు. దీనితో పాటు పసుపు రంగు షో పీస్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు.

మకరం : మకర రాశి వారికి కానుకలతోపాటు ఇనుముతో చేసిన షోపీస్ కూడా బహుమతిగా ఇస్తే మంచిది.

కుంభం : క్రిస్టల్ జ్యువెలరీ లేదా కిచెన్ వస్తువులను బహుమతులుగా ఇవ్వండి. వారికి ఆసక్తి ఉన్న అంశాలను బహుమతిగా ఇచ్చి వారి పనికి మీ నిరంతర మద్దతును ఉండండి.

మీనం : మీన రాశి సోదరికి స్పటిక నగలు, రాగి వస్తువులు బహుమతిగా ఇవ్వండి.

ఈ రక్షా బంధన్ మీ బంధాన్ని మరింత బలంగా చేయాలని కోరుకుంటున్నాం. సోదరి, సోదరుడి బంధం చాలా గొప్పది. ఎల్లప్పుడూ ఒకరికొకరు మద్దతునిచ్చుకోవాలి. అక్కాచెల్లెల్లు సంతోషంగా ఉంటేనే.. జీవితం హాయిగా ఉంటుంది. కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి.

తదుపరి వ్యాసం