తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion : ఈ చిత్రంలో ఎన్ని ముఖాలు ఉన్నాయో.. 15 సెకన్లలో కనుగొంటే మీరు గ్రేట్

Optical Illusion : ఈ చిత్రంలో ఎన్ని ముఖాలు ఉన్నాయో.. 15 సెకన్లలో కనుగొంటే మీరు గ్రేట్

Anand Sai HT Telugu

16 January 2024, 9:30 IST

    • Optical Illusion Images : మీ కళ్ళు ఎంత పదునుగా ఉన్నాయో తెలుసుకోవడానికి మేం మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. ఈ ఛాలెంజ్‌ని ఎదుర్కోగలిగితే మీకే ఫుల్ మార్కులు వచ్చేసినట్టే. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఒక్కసారి చూడండి.
ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

ఆప్టికల్ ఇల్యూషన్

మీ కళ్ళు పదునుగా ఉన్నాయని మీకు నమ్మకం ఉందా? మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం నిజంగా మంచి ఆలోచన. కానీ నిరూపించుకోవాలంటే అందుకు కూడా సిద్ధం కావాలి. దానికోసం కొన్ని ఛాలెంజెస్ స్వీకరించాలి. ఇప్పుడు మీ కళ్ళు ఎంత పదునుగా ఉన్నాయో పరీక్షించుకుందాం. ఇక్కడ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ ఉంది. మీరు దానిలోని అసలు విషయాన్ని కనుగొనాలి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

ఇక్కడ చూపిన చిత్రంలో ఫౌంటెన్ ముందు నిలబడి ఉన్న యువతి స్పష్టంగా కనిపిస్తోంది. అది అందరూ గుర్తుపట్టేదే అయితే అసలు విషయం అది కాదు. ఈ చిత్రంలో దాగి ఉన్న మరో మూడు ముఖాలను చెబితే మీరు తోపులు. మీరు మీ కంటి పదునును ఉపయోగించాలి. ఈ చిత్రంలో దాగి ఉన్న మూడు ముఖాలను కనుగొనడానికి మేం మీకు 15 సెకన్లు మాత్రమే ఇస్తున్నాం. మీ సమయం ఇప్పుడు స్టార్ట్ అయింది.. ఇక వేట మెుదలుపెట్టండి.

ఈ చిత్రంలో మెుత్తం నాలుగు ముఖాలు ఉన్నాయంటే నమ్మండి. ఈ చిత్రాన్ని సూటిగా చూస్తే ఒక ముఖం, కిందకి చూస్తే మరో ముఖం కనిపిస్తుంది. ఇవి ఈజీగానే గుర్తుపట్టొచ్చు. పై నుంచి కుడివైపు చూస్తే మరో ముఖం కనిపిస్తుంది. అమ్మాయి క్యాప్ సూటిగా చూడండి అర్థమవుతుంది. మరో ముఖం ఎక్కడ ఉంది అంటే.. ఎడమ వైపు సరిగా పరిశీలించండి. సరిగా పరిశీలిస్తే అర్థమవుతుంది. మీకు అనుమానం ఉంటే ఉల్టా చేసి కూడా చూడొచ్చు. చివరలో మీకోసం సమాధానంతో కూడిన ఫొటో కూడా ఉంది.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ తమ మొబైల్‌లో ఎక్కువ సమయం గడిపేవారికి సహాయపడతాయి. మీ ఐక్యూ స్థాయి ఎంత? మీ కన్ను ఎంత పదనుగా ఉంటుంది? ఏకాగ్రత ఎంత? ఇచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు? ఇటువంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. అలాగే అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్ పరిష్కరించడానికి మీకు సాధారణంగా 10-15 సెకన్లు మాత్రమే ఉన్నందున మీరు ఎంత వేగంగా స్పందిస్తున్నారో కూడా ఇది చూపిస్తుంది.

మనకు సాధారణ చిత్రం మాత్రమే కనిపిస్తుంది. ఆ చిత్రంలో కనిపించే రంగులపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నాం. అయితే మన మెదడుకు పని ఇవ్వడం ప్రారంభించినప్పుడే ఆ చిత్రం లోపల దాగివున్న రహస్యాలు మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. చాలా సార్లు మన మెదడు చిత్రాలను ఊహిస్తుంది.

ఆప్టికల్ ఇల్యూషన్‌లో చాలా రంగులు ఉపయోగిస్తారు. ఇది అనవసరమని మనకు అనిపించవచ్చు. వాస్తవానికి ఇవి మనల్ని కన్ఫ్యూజ్ చేసేందుకు ఉంటాయి. ఆ రంగుల వల్ల మీ ఏకాగ్రత చెదిరిపోకూడదు. మీరు కనుగొనవలసిన వాటిపై మాత్రమే మీరు ఫోకస్ చేయాలి. మీరు ఈ రంగుల గురించి ఇబ్బంది పడకూడదు.

ఆప్టికల్ ఇల్యూషన్‌ మన కంటి చూపు ఎంత పదునైనదో చెబుతుంది. అంతేకాదు.. మనం ఎంత ఏకాగ్రతతో ఉన్నామో చెబుతుంది. పిల్లలకు ఇలాంటివి చూపించి కనుగొనమని చెప్పండి. వారి మెదడు పదునుగా పనిచేస్తుంది. పెద్దలు కూడా మీ కంటి చూపు ఎంత మెరుగ్గా ఉందో ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా చెక్ చేసుకోండి. మీరు ఏదైనా విషయంపై ఎంత ఫోకస్ చేస్తున్నారో కూడా అర్థమవుతుంది.

సమాధానం ఇదే
తదుపరి వ్యాసం