తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Motorola Discount । బంపర్ ఆఫర్.. Moto G71 5g ఫోన్‌పై రూ. 5 వేల భారీ డిస్కౌంట్!

Motorola Discount । బంపర్ ఆఫర్.. Moto G71 5G ఫోన్‌పై రూ. 5 వేల భారీ డిస్కౌంట్!

HT Telugu Desk HT Telugu

14 July 2022, 18:39 IST

    • మోటోరోలా కంపెనీ Moto G71 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. తగ్గింపు ధరతో ఈ 5G ఫోన్ ధర అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Motorola Moto G71 5G smartphone
Motorola Moto G71 5G smartphone

Motorola Moto G71 5G smartphone

అమెరికన్ స్మార్ట్‌ఫోన్‌ మేకర్ మోటోరోలా ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో Moto G71 పేరుతో ఒక 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిని రూ. 19,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే కంపెనీ ఇటీవల మార్కెట్లో మరిన్ని కొత్త ఫోన్లను విడుదల చేసిన నేపథ్యంలో ఈ Moto G71 5G స్మార్ట్‌ఫోన్‌ ధరపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. 6GB RAM మోడల్ పై ఏకంగా రూ. 4000 వేలు తగ్గించి రూ. 15,999 ధరకు Flipkartలో విక్రయిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

అలాగే SBI క్రెడిట్ కార్డ్ వినియోగించి కొనుగోలు చేస్తే Motorola G71 5Gపై అదనంగా మరో రూ. 1,000 తగ్గింపును పొందుతారు. ఈ ప్రకారంగా రూ. 5 వేల డిస్కౌంట్ ధరతో Moto G71 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు రూ. 14,999/- కే సొంతం చేసుకోవచ్చు.

Moto G71 5G అనేది బడ్జెట్ ధరలోనే లభించే ఒక మంచి 5G ఫోన్. ఇందులో ఎన్నో మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అలాగే ఇది ఆర్కిటిక్ బ్లూ, నెప్ట్యూన్ గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలను ఈ కింద చూడవచ్చు.

Moto G71 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.4 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
  • 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్

కనెక్టివిటీపరంగా Moto G71 లో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్,3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్ కొద్దికాలం వరకే ఉండవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం