తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nothing Phone (1) । వచ్చేసింది సమ్‌థింగ్ స్పెషల్ నథింగ్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?

Nothing Phone (1) । వచ్చేసింది సమ్‌థింగ్ స్పెషల్ నథింగ్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

12 July 2022, 22:03 IST

    • అండ్రాయిడ్ మార్కెట్లోకి మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ ప్రవేశించింది. లండన్‌కు చెందిన నథింగ్ అనే కంపెనీ తమ బ్రాండ్ నుంచి మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ Nothing Phone (1) ను విడుదల చేశారు. ఇండియాలో దీని ధర ఎంత, ఇతర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
Nothing Phone (1)
Nothing Phone (1)

Nothing Phone (1)

అనేక రకాల ఊహాగానాలు, మరెన్నో లీకులతో ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న 'నథింగ్ ఫోన్' ఎట్టకేలకు విడుదలైంది. Carl Peiకి చెందిన నూతన కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ Nothing Phone (1) పేరుతో తమ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తద్వారా అధికారికంగా ఆండ్రాయిడ్ మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ Carl Pei మొదట్లో Pete Lauతో కలిసి 2013లో OnePlus బ్రాండ్‌ను ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో వన్ ప్లస్ ఎంత పాపులర్ బాండ్ అనేది తెలిసిందే. అయితే 2020లో Pei తాను భాగస్వామిగా ఉన్న OnePlusని విడిచిపెట్టారు. నథింగ్ పేరుతో సమ్ థింగ్ స్పెషల్ గా ముందుకొచ్చారు. Nothing Ear (1) earbuds తమ బ్రాండ్ నుంచి విడుదల మొదటి ఉత్పత్తి కాగా, Nothing Phone (1) ఫోన్ తమ మొదటి స్మార్ట్‌ఫోన్‌.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు భారత మార్కెట్లో విడుదలయింది. కాన్ఫిగరేషన్ పరంగా వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవంతో పాటు ప్రత్యేకమైన LED-లైటింగ్, పారదర్శక బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉండి మార్కెట్లలో అందుబాటులో ఉండే ఇతర స్మార్ట్‌ఫోన్లకు ఈ నథింగ్ ఫోన్ కాస్త భిన్నత్వాన్ని ప్రదర్శిస్తోంది.

ధరెంత? ఎలా కొనుగోలు చేయాలి?

Nothing Phone (1) జూలై 21, 2022 సాయంత్రం 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో 'బ్లాక్ అండ్ వైట్‌' కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ముందస్తు ఆర్డర్ కూడా చేయవచ్చు. ప్రీబుకింగ్ చేసుకున్న వారికి కంపెనీ లాంచ్ ఆఫర్‌లను ప్రకటించింది.

ధరలను పరిశీలిస్తే 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 31,999/-, 8GB RAM /256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 34,999, అలాగే టాప్ స్పెక్ మోడల్ 12GB RAM /256GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర రూ. 37,999/- గా ఉన్నాయి.

అంతేకాదు ఈ నథింగ్ ఫోన్ (1) స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారికి రూ. 1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

అయితే ఇంటర్నల్ స్టోరేజీని విస్తరించుకోవడానికి ఈ ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ ఉండదు. అలాగే ఈ ఫోన్‌తో పాటుగా ఎలాంటి ఛార్జింగ్ అడాప్టర్ లేదా ప్రొటెక్షన్ కేస్ లభించదు.

టాపిక్

తదుపరి వ్యాసం