తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : జీవితంలో ఎవరి నుంచి ఏదీ ఆశించకు.. బాధే మిగులుతుంది

Monday Motivation : జీవితంలో ఎవరి నుంచి ఏదీ ఆశించకు.. బాధే మిగులుతుంది

Anand Sai HT Telugu

25 December 2023, 5:00 IST

    • Monday Motivation : జీవితంలో ఎవరి దగ్గర ఏమీ ఆశించకూడదు. ఆశిస్తే కచ్చితంగా మీరు బాధపడతారు. మనం చేశాం.. కదా అని వారి నుంచి కూడా వస్తుందనుకుంటే మీరు కచ్చితంగా తప్పుగా ఆలోచిస్తున్నట్టే.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ప్రతీకాత్మక చిత్రం

జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ఎందరికో సాయం చేస్తుంటాం. మనం సాయం చేశామని మనకు గుర్తుండాల్సిన అవసరం లేదు. సాయం పొందిన వ్యక్తికి గుర్తుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం వారికి పని చేసి పెట్టాం కదా.. మనకూ చేసేస్తారులే అనుకుంటే మీకు నిరాశే మిగులుతుంది. ఈ లోకంలో ఎవరూ.. ఎవరికీ ఏ విధమైన సాయం చేయరు. సాయం చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలి అంతే. ఆ విషయం ఎదుటి వ్యక్తి సరిగా అర్థం కావాలి. ఏదైనా చేస్తారు అని ఆశతో వెళితే మీకు నిరాశే మిగులుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

ఉదాహరణకు ఓ కథ చెప్పుకుందాం. ఒక వ్యాపారికి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. రోడ్డు మీదకు వచ్చేశాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇదే సమయంలో అతడి పరిస్థితిని మరో వ్యాపారి చూశాడు. ఎంతో కొంత సాయం చేయాలనుకున్నాడు. నష్టాల నుంచి బయటకు తెచ్చేందుకు తన వంతు సాయం చేశాడు. రోజులు గడిచాయి. సాయం చేసిన వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.

ఓ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన పరిస్థితి గురించి గతంలో తాను సాయం చేసిన వ్యక్తితో పంచుకున్నాడు. మనసులో సాయం చేస్తాడని ఆశ పెట్టుకున్నాడు. కానీ రెండో వ్యాపారి దగ్గర నుంచి సాయం పొందిన మెుదటి వ్యాపారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. చివరకు రెండో వ్యాపారి తనకు ఆర్థికంగా సాయం కావాలని అడిగాడు. నేను వేరే చోట వ్యాపారం మెుదలుపెడుతున్న.. దానికోసం పెట్టుబడి మాత్రమే ఉంది. నా దగ్గర డబ్బులు లేవని వెళ్లిపోయాడు మెుదటి వ్యాపారి.

గతంలో సాయం చేసినా తనను పట్టించుకోలేదని రెండో వ్యాపారి చాలా బాధపడ్డాడు. సాయం చేసినందుకు కృతజ్ఞత కూడా లేదని అనుకున్నాడు. మనుషులకు సాయం చేసి మరిచిపోవాలని నిర్ణయానికి వచ్చాడు.

అందుకే జీవితంలో మీకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. మీరేంత సాయం చేసినా మిగతావారు మీకు సాయం చేయాలని ఆశించకూడదు. అలా రూల్ ఏమీ లేదు. ఇదే బంధం విషయంలోనూ జరుగుతుంది. మీరు ఎదుటివారిపై ఎంతో ప్రేమను చూపిస్తారు. కానీ వారి దగ్గర నుంచి సరైన స్పందన ఉండదు. ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకోసమే మీరు ఎంత ప్రేమించారో ఎదుటి వారికి అర్థమయ్యేలా చేయాలి. ఒకవేళ వారికి అర్థమైతే.. అంతే ప్రేమను తిరిగి ఇస్తారు. లేదంటే మీరు కూడా పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. ఎదుటి వారి నుంచి ఏదైనా ఆశిస్తే చివరకు మిగిలేది బాధే.

మీ జీవితంలో మనశ్శాంతి కావాలంటే ఒకరి దగ్గర నుంచి ప్రేమను ఆశించడం మానేయండి..

మనసుకు ఆనందం కావాలంటే సాయం చేసిన వ్యక్తి నుంచి ఏదైనా ఆశించడం ఆపేయండి..

ఆశించడం అనవసరం..

తదుపరి వ్యాసం