తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : ఆత్మవిశ్వాసం ఉంటే.. గడ్డిపరక కూడా ఆయుధమవుతుంది

Monday Motivation : ఆత్మవిశ్వాసం ఉంటే.. గడ్డిపరక కూడా ఆయుధమవుతుంది

HT Telugu Desk HT Telugu

11 September 2023, 5:00 IST

    • Monday Motivation : మనిషి అనుకుంటే సాధించలేనిదేదీ లేదు. కానీ కొందరు మాత్రం చిన్న చిన్న విషయాలకే కుంగిపోతారు. ఆత్మవిశ్వాసం లేక ఉన్నచోటే ఉంటారు. ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచమే మీ కాళ్ల ముందుకు వస్తుంది.
మోటివేషన్
మోటివేషన్

మోటివేషన్

ఆత్మవిశ్వాసం లేని మనిషి ఎలాంటి విజయాన్నీ సాధించలేడు. ఎందుకంటే మెుదట అతడి మీద అతడికే నమ్మకం ఉండదు. ఏది మెుదలుపెడితే ఏమవుతుందోనని భయంలో ఉంటాడు. అందుకే నీకు నువ్వు శత్రువు కాకూడదు. ప్రపంచమే ఓ గ్రంథాలయం.. అన్ని విషయాలు నేర్చుకుంటూ పోవాలి. తెలియని విషయాన్ని మళ్లీ మళ్లీ పరిశీలించాలి. దానికోసం మీకు ఆత్మవిశ్వాసం, మీ మీద మీకు నమ్మకం ఎక్కువగా ఉండాలి. నలుగురితో నారాయణ అనుకుంటే.. మీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండదు. మన మనసుకు మనం బందీ కాకూడదు.

ట్రెండింగ్ వార్తలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

ఏనుగులు ఎంత బలమైనవో తెలుసా కదా. పెద్ద పెద్ద చెట్లను తొండంతో కూల్చగలవు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు పెద్ద వాహనాలను ఒక్కసారిగా పక్కకు తోసేయగలవు. ఇదంతా.. ఒకవైపే.. కానీ మరోవైపు వేరేలా ఉంటుంది. అదే ఏనుగు మావటి వాడి చేతిలోకి వచ్చినప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరిశీలిస్తే.. చిన్న ఏనుగులకు గొలుసుతో కట్టేసి ఉంటుంది. అదే పెద్ద ఏనుగుకు మాత్రం జస్ట్ ఒక తాడు ఉంటుంది.

చిన్న ఏనుగును తీసుకొచ్చినప్పుడు మావటి వాడు.. దానికి గొలుసుతో కట్టేస్తాడు. అది మెుదట్లో తప్పించుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ ఇనుముతో చేసిన గొలుసు కదా.. అస్సలు రాదు. ఇక చివరికి చేసేదేమీ లేక.. అది అలానే ఉంటుందేమో అనుకుంటుంది. పెద్దగా అవుతుంటే.. కనీసం గొలుసును లాక్కుందామనే ప్రయత్నం కూడా చేయదు. ఎందుకంటే.. దాని మైండ్ ఇక నా జీవితం ఇంతే, నేను లాగినా.. ఆ గొలుసు రాదేమోనని ట్యూన్ చేసుకుంటుంది.

అది పెరిగి పెద్ద అయ్యాక.. చిన్న తాడుతో కట్టేసినా అలానే ఉండిపోతుంది. లాగేందుకు కూడా ప్రయత్నం చేయదు. కానీ గట్టిగా లాగితే.. ఈజీగానే ఆ తాడు తెగిపోతుంది. కానీ ఉన్నది ఇనుప గొలుసేమోనని భ్రమలోనే ఉండిపోతుంది పెద్ద ఏనుగు. తెంచుకుని వెళ్లాలనే ఆత్మవిశ్వాసం కూడా ఉండదు.

అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి. బంధాలు, ఎమోషన్స్ అనే తాడును కొన్నిసార్లు వదులుకోవాలి తప్పదు. మీ జీవితానికి మీరే మావటి కావాలి. ఎవరి మాట వినొద్దు.. చుట్టు పక్కల వారి మాట అస్సలు వినొద్దు. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయ్.. గెలుపును నీ బానిస చేయ్..

తదుపరి వ్యాసం