తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sabarimala: 39 రోజుల్లో 223 కోట్ల ఆదాయం.. ఘనంగా మండల పూజ

Sabarimala: 39 రోజుల్లో 223 కోట్ల ఆదాయం.. ఘనంగా మండల పూజ

HT Telugu Desk HT Telugu

27 December 2022, 15:17 IST

    • Mandala puja at Sabarimala: శబరిమలలో మండల పూజల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
శబరిమల ఆలయం (ఫైల్ ఫోటో)
శబరిమల ఆలయం (ఫైల్ ఫోటో) (ANI Pic Service)

శబరిమల ఆలయం (ఫైల్ ఫోటో)

పత్తనంతిట్ట(కేరళ): మండల పూజల సందర్భంగా అయ్యప్ప స్వామి అనుగ్రహం కోరుతూ శబరిమల ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సోమవారం సాయంత్రం సన్నిధానం (ఆలయ సముదాయం) వద్దకు తీసుకొచ్చిన పవిత్ర బంగారు వస్త్రంతో ప్రధాన విగ్రహాన్ని అలంకరించిన తర్వాత తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

Infertility in Indians: పిల్లలు పుట్టక ఇబ్బందిపడుతున్న భారతీయ భార్యాభర్తలు, ఎందుకిలా?

Chanakya Niti Telugu : మీకు ఈ అలవాట్లు ఉంటే పేదరికంలోనే ఉండిపోతారు

Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Cucumber Egg fried Rice: కీరాదోస ఎగ్ ఫ్రైడ్ రైస్... బ్రేక్ ఫాస్ట్ లో అదిరిపోయే వంటకం, ఎవరికైనా నచ్చుతుంది

స్వామియే శరణం అయ్యప్పా అంటూ భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిరీక్షిస్తూ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలభాభిషేకం, కలశాభిషేకం వంటి ప్రత్యేక పూజలు జరిగాయి. మండల పూజ ముగిసిన వెంటనే ఆలయాన్ని మూసివేసి, భక్తుల ప్రార్థనల కోసం సాయంత్రం తెరుస్తారు. ఆలయం మూడు రోజుల పాటు మూసివేసి డిసెంబర్ 30న 5 గంటలకు తిరిగి తెరుస్తారు.

ఈ మండల పూజ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అయినప్పటికీ ఎలాంటి విఘాతం లేకుండా మండల పూజలు ఘనంగా జరిగాయి. 30 లక్షల మందికి పైగా భక్తులు కొండకు చేరుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనులు సాగాయని ఇక్కడి అతిథి గృహంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో అన్నారు. గత 39 రోజుల్లో రూ. 222.98 కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయాన్ని నిర్వహించే అపెక్స్ టెంపుల్ బాడీ ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ (టీడీబీ) తెలిపింది.

టాపిక్

తదుపరి వ్యాసం