తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Remedies For Tonsillitis। గొంతు నొప్పి వేధిస్తుందా? ఈ చిట్కాలతో టాన్సిలిటిస్‌కు తక్షణ ఉపశమనం!

Remedies for Tonsillitis। గొంతు నొప్పి వేధిస్తుందా? ఈ చిట్కాలతో టాన్సిలిటిస్‌కు తక్షణ ఉపశమనం!

HT Telugu Desk HT Telugu

19 July 2023, 15:14 IST

    • Home Remedies for Tonsillitis: వర్షాకాలంలో టాన్సిలిటిస్ లక్షణాలను సమర్థవంతంగా చికిత్స చేయడానికి అనేక ఇంటి నివారణలు ఉన్నాయి. అవి ఇక్కడ చూడండి.
Home Remedies for Tonsillitis
Home Remedies for Tonsillitis (istock)

Home Remedies for Tonsillitis

Home Remedies for Tonsillitis: వర్షాకాలంలో గొంతునొప్పి, గొంతులో మంట, గొంతు వాపు అనేవి ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యలు. నిజానికి ఈ సమస్యలు కాలానుగుణమైనవి కానప్పటికీ, ఎవరికైనా, ఎప్పుడైనా సంభవించవచ్చు. వర్షాకాలంలో టాన్సిల్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో కలిగే మార్పులు, చల్లదనం, తేమ పరిస్థితులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో సహా వివిధ వ్యాధుల పెరుగుదలకు దారితీస్తుంది. టాన్సిల్స్ వాపు వల్ల వచ్చే సాధారణ సమస్య టాన్సిలిటిస్. వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలలో ఇది ఒకటి.

టాన్సిలిటిస్ అనేది గొంతు వెనుక భాగంలో ఉండే రెండు చిన్న గ్రంథులలో ఏర్పడే ఒక అనారోగ్య సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు గొంతులో మంట, వాపు, ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది, నోటి దుర్వాసన, జ్వరం వంటి ఇబ్బందులు ఉంటాయి. రోగకారక క్రిములు శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించకుండా నిరోధించడం టాన్సిల్స్ ప్రాథమిక విధి. కానీ కొన్నిసార్లు అవి కూడా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. దీనికి కారణం వైరస్ లేదా బ్యాక్టీరియా కావచ్చు. స్ట్రెప్టోకోకస్ పయోజెనెస్ అనే బ్యాక్టీరియా గొంతు నొప్పికి అత్యంత సాధారణ కారణం.

ఇవి మాత్రమే కాకుండా దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపిస్తాయి. ఇవి కూడా టాన్సిల్స్ వాపుకు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు దారితీస్తాయి.

టాన్సిలిటిస్‌కు కారణమయ్యే వైరల్ ఇన్‌ఫెక్షన్లు వాటంతట అవే పోతాయి. అయితే, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ అవసరం కావచ్చు. టాన్సిలిటిస్ లక్షణాలను సమర్థవంతంగా చికిత్స చేయడానికి అనేక ఇంటి నివారణలు ఉన్నాయి. అవి ఇక్కడ చూడండి.

ఉప్పు నీరుతో పుక్కిలించండి

గోరువెచ్చని ఉప్పునీటితో నోరు పుక్కిలించడం, కడుక్కోవడం వల్ల గొంతునొప్పి, టాన్సిలిటిస్ వల్ల కలిగే నొప్పిని తగ్గించవచ్చు. ఇది వాపును కూడా తగ్గిస్తుంది, అంటువ్యాధుల నివారణకు సహాయపడవచ్చు.

లికోరైస్

లికోరైస్ లాజెంజెస్‌ వంటి ఉత్పత్తులు గొంతును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి, కొన్ని లాజెంజెస్‌లో సహజ శోథ నిరోధక లక్షణాలు లేదా నొప్పిని స్వయంగా తగ్గించే పదార్థాలు ఉంటాయి. లైకోరైస్‌ను ఒక మూలవస్తువుగా కలిగి ఉన్న లాజెంజ్‌లు బలమైన యాంటీ ఇన్ల్ఫమేటరీ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. లికోరైస్ బిళ్లలు చప్పరించడం వలన టాన్సిల్స్, గొంతులో అసౌకర్యం రెండింటికీ ఉపశమనం కలిగిస్తుంది.

తేనెతో గోరు వెచ్చని టీ

టీ వంటి పానీయాలు టాన్సిలిటిస్ ఫలితంగా సంభవించే అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. తేనె బలమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది టాన్సిలిటిస్‌కు కారణమయ్యే అంటువ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. అల్లం టీ, ఫెన్నెల్ టీ మొదలైన రకాల హెర్బల్ టీలలో తేనే కలుపుకొని గోరువెచ్చాగా తాగాలి.

హ్యూమిడిఫైయర్లు

గాలి పొడిగా ఉంటే లేదా టాన్సిలిటిస్ కారణంగా మీ నోరు పొడిబారినట్లయితే గొంతు నొప్పి పెరుగుతుంది. దీని నుండి ఉపశమనం పొందేందుకు హ్యూమిడిఫైయర్లు సహాయపడతాయి. పొడి గాలి గొంతును చికాకుపెడుతుంది, గాలిలో కొంత తేమను తిరిగి చేర్చడం ద్వారా గొంతు, టాన్సిల్స్‌లో అసౌకర్యాన్ని తగ్గించడంలో హ్యూమిడిఫైయర్‌లు సహాయపడతాయి. ప్రత్యేకించి వైరస్‌లు టాన్సిలిటిస్‌కు కారణమైనప్పుడు. కూల్-మిస్ట్ హ్యూమిడిఫైయర్‌లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

పరిశుభ్రత పాటించడం, పుష్కలంగా నీరు తాగడం, పోషకాహారం తినడం ద్వారా టాన్సిలిటిస్ సమస్యను వేగంగా నయం చేసుకోవచ్చు.

వర్షాకాలంలో వచ్చే టాన్సిల్స్ సమస్యలకు భయపడాల్సిన పనిలేదు. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ, చికిత్స కోసం నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం అవసరం. వర్షాకాలంలో ఏ సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. ఇది మరో సమస్యకు దారి తీస్తుంది.

తదుపరి వ్యాసం