తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blurry Vision In The Morning: ఉదయం లేచాక కళ్లు సరిగ్గా కనిపించడం లేదా? కారణాలివే..

Blurry Vision in the Morning: ఉదయం లేచాక కళ్లు సరిగ్గా కనిపించడం లేదా? కారణాలివే..

HT Telugu Desk HT Telugu

02 November 2023, 9:00 IST

  • Blurry Vision in the Morning: ఉదయాన్నే దృష్టి సరిగ్గా కనిపించకపోవడానికి చాలా కారణాలుండొచ్చు. అవేంటో తెలుసుకుంటే సరైన సమయంలో వైద్య సలహా తీసుకుని సమస్య నుంచి బయటపడొచ్చు.

బ్లర్ విజన్ కారణాలు
బ్లర్ విజన్ కారణాలు (freepik)

బ్లర్ విజన్ కారణాలు

కొంత మందికి మామూలప్పుడు దృష్టి చక్కగా పని చేస్తూ ఉంటుంది. అయితే ఉదయాన్నే కొంత సేపటి వరకు కళ్లు మసక బారినట్లు అనిపిస్తాయి. అలాగే నిద్రపోయి లేచినా కూడా కళ్లు కనిపించడం సరిగ్గా లేనట్లు భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఎవరిలో కనిపించినా కారణాలు మాత్రం ఇవే అయి ఉండొచ్చని కంటి వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ వివరిస్తున్నారు. చదివేయండి మరి.

ట్రెండింగ్ వార్తలు

Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

Personality Test: ఇక్కడ ఇచ్చిన చిత్రంలో మీకు మొదట ఏ జంతువు కనిపించిందో చెప్పండి, మీరు ఎలాంటి వారో మేము చెప్పేస్తాం

White Bed Sheets In Railway : రైలు స్లీపర్ కోచ్‌లలో తెల్లని బెడ్‌షీట్‌లనే ఎందుకు ఇస్తారు..

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

ఉదయాన్నే కంటి చూపు లోపానికి కారణాలు :

కళ్లు పొడిబారడం:

మన కళ్లను కన్నీళ్లు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. నిద్రపోయే సమయంలో ఒక్కోసారి కంట్లోకి కన్నీళ్లు ఊరక పొడి బారిపోతాయి. అందువల్ల లేచిన తర్వాత కాసేపటి వరకు చూపు మందగించినట్లుగా ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత కాసేపు కను రెప్పలు మూసి తెరుస్తూ ఉంటూ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది.

ఒత్తిడి కలిగేలా పడుకోవడం:

కొందరు బోర్లా పడుకుని ముఖాన్ని తలగడలోకి పెట్టేసుకుంటారు. అలాంటప్పుడు కళ్లు ఒత్తిగిల్లినట్లై వాటికి ఒత్తిడి కలుగుతుంది. అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుంది.

కంటి అలర్జీలు :

కళ్లకు ఏవైనా అలర్జీలు కలిగినప్పుడు అవి దురదలు పెట్టడం, వాయడం, పొడి బారడం లాంటివి జరుగుతాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే ఉదయం పూట కాసేపు కళ్లు సరిగ్గా కనిపించట్లేనట్లు ఉంటాయి.

రక్తంలో చక్కెర :

మన రక్తంలో చక్కెర మరీ ఎక్కువగా ఉండటం లేదా మరీ తక్కువగా ఉండటం జరిగితే గనుక ఉదయాన్నే చూపు మందగించినట్లుగా అవుతుంది. బలహీనతతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా మధుమేహం టెస్టులు చేయించుకోవాలి.

నిద్రపోయే ముందు వేసుకునే మందులు:

కొంత మంది నిద్రించే ముందు వేరే వేరే ఆరోగ్య సమస్యలకు మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నిద్ర మాత్రలు, జలుబు మాత్రలు, బీపీ బిళ్లలు లాంటివి కళ్లలో నీరు ఊరడంపై ప్రభావం చూపిస్తాయి. దీంతో ఉదయాన్నే లేవగానే చాలా మందికి మసక దృష్టి ఉంటుంది.

కాంటాక్ట్‌ లెన్సులు:

కొందరు ఉదయం పూట కాంటాక్ట్‌ లెన్సులు ధరిస్తారు. రాత్రి వాటితో పొరపాటున పడుకుంటే ఉదయానికి దృష్టి మసకబారినట్లు అనిపించవచ్చు.

నూనె గ్రంథులు:

కొన్ని సార్లు కళ్ల చుట్టు పక్కల ఉండే నూనె గ్రంథులు నిద్ర పోతున్నప్పుడు కొంత నూనె, నీటిని ఉత్పత్తి చేస్తాయి. అలాంటప్పుడు కంటి ఇరిటేషన్‌, దృష్టి మసకబారడం లాంటివి చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ కారణాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీకు కళ్లు ఉదయం పూట ఎందుకు కనిపించడం లేదో గుర్తించాలి. సమస్య తీవ్రతను బట్టి వైద్యుల్ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం