తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Peel Off Masks: పండగ రోజు మెరిసేందుకు ఇన్స్టంట్ పీలాఫ్‌ మాస్కులు.. ఇంట్లోనే రెడీ..

Peel off masks: పండగ రోజు మెరిసేందుకు ఇన్స్టంట్ పీలాఫ్‌ మాస్కులు.. ఇంట్లోనే రెడీ..

23 October 2023, 15:00 IST

  • Peel off masks: పండగరోజు ముఖం మెరిసిపోవాలంటే ఈ పీలాఫ్ మాస్కులు ప్రయత్నించండి. ఇంట్లోనే కొన్ని పదార్థాలతో వీటిని తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూసేయండి. 

పీలాఫ్ మాస్కులు
పీలాఫ్ మాస్కులు (pexels)

పీలాఫ్ మాస్కులు

పండగ సమయాల్లో ముఖం డల్ గా అనిపిస్తే ఎలా? ముఖం మరీ నిర్జీవంగా, కాంతివిహీనంగా ఉంది అనిపిస్తే.. ఎక్కువ సమయం లేదు అనుకున్నప్పుడు ఈ పీలాఫ్‌ మాస్కుల్ని ఓ సారి ప్రయత్నించి చూడండి. ముఖానికి అప్పటికప్పుడు నిగారింపును ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని మెరిసిపోయేలా చేస్తాయి. అయితే మార్కెట్‌లో ఇన్‌స్టెంట్‌గా వేసుకునే ఎన్నో రకాల పీలాఫ్‌ మాస్కులు అందుబాటులో ఉన్నాయి. వాటి కంటే ఇంట్లో ఉండే సహజమైన పదార్థాలతో చక్కగా ఈ ఫేస్‌ మాస్కులు వేసుకోండి. వీటి వల్ల మీ చర్మం దుష్ప్రభావాలకు లోనుకాకుండా ఉంటుంది. అలాగే లోపలి నుంచీ శుభ్ర పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

జిడ్డు చర్మం ఉన్న వారికి :

ముఖ సౌందర్యాన్ని ఇనుమడింప చేయడంలో బొగ్గు ఎంతగానో సహకరిస్తుంది. ముఖానికి పట్టి ఉన్న జిడ్డు, దుమ్ము ధూళిని సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. యాక్టివ్‌ ఛార్‌ కోల్‌ పౌడర్‌, బెంటోనైట్‌ క్లే, జిలెటన్‌లను ఒక్కో టీ స్పూను చొప్పున వేయండి. కొద్దిగా నీటిని చేర్చి ఈ మూడింటినీ బాగా కలపండి. బ్రష్‌ సహాయంతో దాన్ని ముఖానికి వేసుకోండి. 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత జాగ్రత్తగా కొనలను పట్టుకుని పీలాఫ్‌ చేసుకోండి. ఒక్కసారి వీటిని తెచ్చిపెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడల్లా వాడుకోవచ్చు.

బ్లాక్‌హెడ్స్‌ ఉన్న వారికి :

కొందరికి ముఖంపై ఎక్కువగా బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌, పిగ్మంటేషన్‌ లాంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారు మునగ ఆకులను మాస్క్‌గా వేసుకోవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అందుకు మునగాకు పొడి, జిలెటన్‌, గోరు వెచ్చని నీటిని రెండు టీస్పూన్ల చొప్పున తీసుకోండి. దాంట్లో ఒక స్పూను పెరుగు, ఒక విటమిన్‌ ఈ క్యాప్సూల్‌ని వేయండి. అన్నింటిని బాగా కలిపి ముఖానికి పట్టించండి. 20 నిమిషాల తర్వాత పీలాఫ్‌ చేస్తే సరి.

మొటిమలు ఉన్న వారికి :

ముఖంపై ఎక్కువ మొటిమలు, మచ్చలు ఉన్న వారు గుడ్డు తెల్ల సొనతో చేసిన పీలాఫ్‌ మాస్క్ వేసుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. మచ్చలను ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది. ముందుగా గుడ్డును పగలగొట్టి తెల్ల సొనను గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అది క్రీమీగా అయ్యే వరకు బాగా గిలకొట్టండి. అది కాస్త చిక్కబడినట్లుగా అయ్యాక ముఖానికి రాసుకోండి. పావుగంట సేపు ఆరనివ్వండి. తర్వాత పీలాఫ్‌ చేస్తే మృతకణాలతో సహా ఊడి వస్తుంది. ముఖం మెరిసిపోతుంది.

తెల్లగా అవ్వాలనుకునే వారికి :

కొందరికి ఎక్కువగా ఎండలో తిరిగేయడం వల్ల ముఖం నల్లగా మారి ఉంటుంది. అలాంటి వారు తొందరగా ట్యానింగ్‌ని తగ్గించుకుని తెల్లగా మారాలనుకుంటే దీన్ని ప్రయత్నించవచ్చు. తేనె, నిమ్మరసాలను ఒక్కొక్క స్పూను చొప్పున ఓ గిన్నెలో వేయండి. తర్వాత అందులో అన్ ఫ్లేవర్డ్‌ జిలెటిన్‌ని వేసి కలపండి. మూడూ బాగా కలిసిన తర్వాత కావాలనుకుంటే కొద్దిగా నీటిని వేసి పేస్ట్‌లా అయ్యేలా చేయండి. దాన్ని బ్రెష్‌ సహాయంతో ముఖానికి వేసుకోండి. 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత పీలాఫ్‌ చేస్తే చక్కగా వచ్చేస్తుంది.

తదుపరి వ్యాసం