తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods For Weight Loss । బరువు తగ్గాలా? అయితే కొవ్వును కరిగించే ఈ ఆహారాలు తినండి!

Foods For Weight Loss । బరువు తగ్గాలా? అయితే కొవ్వును కరిగించే ఈ ఆహారాలు తినండి!

HT Telugu Desk HT Telugu

24 June 2023, 7:30 IST

    • Foods For Weight Loss: అధిక బరువును తగ్గించుకోడానికి మీరు  సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ఎలాంటి పదార్థాలు కొవ్వును కరిగించడంలో సహాయపడగలవో ఇక్కడ తెలుసుకోండి.
Foods For Weight Loss
Foods For Weight Loss (istock)

Foods For Weight Loss

foods for weight loss: అధిక బరువు సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? విపరీతంగా బరువు పెరగటం, ఊబకాయం మీ రూపాన్ని పాడుచేయడమే కాకుండా, అనేక దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు సాధారణం కంటే అధిక బరువును కలిగి ఉన్నట్లయితే, వెంటనే పెరిగిన అధిక బరువును నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అనియంత్రంగా బరువు పెరగటం ఆర్థరైటిస్, మధుమేహం, గుండె జబ్బులు వంటీ తీవ్రమైన వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

అధిక శరీర బరువును తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన సూత్రం, మీరు రోజూవారీగా తీసుకునే క్యాలరీల సంఖ్యను తగ్గించడం, అలాగే శారీరక శ్రమ ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, అదనపు క్యాలరీల ఎప్పటికప్పుడు బర్న్ చేయండి. కేలరీలు ఖర్చు చేసినపుడు కొవ్వు కరుగుతుంది, ఇది బరువు తగ్గించడానికి చాలా ముఖ్యం.

కొవ్వును కరిగించే ఆహారాలు

కొవ్వును కాల్చడానికి, అధిక బరువును తగ్గించుకోడానికి మీరు సాధారణ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడంతో పాటు సరైన ఆహారాన్ని ఎంచుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఎలాంటి పదార్థాలు కొవ్వును కరిగించడంలో సహాయపడగలవో ఇక్కడ తెలుసుకోండి

ప్రోబయోటిక్స్

పెరుగు, మజ్జిగ, కెఫీర్ వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవడం బరువును నియంత్రించడంలో, కొవ్వును కాల్చడంలో సహాయపడతాయి. పెరుగు చాలా పోషకమైనది. ఇది ప్రోటీన్, పొటాషియం, కాల్షియం మొదలైన పోషకాలకు అద్భుతమైన మూలం. ఇవి శరీరానికి అవసరమైన మూలకాలు, అదనంగా, ప్రోబయోటిక్స్ మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, జీవక్రియకు మెరుగుపరుస్తాయి, తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

టొమాటో

టమోటాలు ఆకలిని తగ్గిస్తాయి. ఎందుకంటే టొమాటోలో నీరు, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది తిన్నప్పుడు కడుపు చాలా నిండినట్లుగా అనిపిస్తుంది. తైవాన్‌లోని చైనా మెడికల్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం, రెండు నెలల పాటు రోజుకు 250 మిల్లీలీటర్ల టొమాటో జ్యూస్ తాగే స్త్రీలలో శరీరంలో కొవ్వు, బరువు గణనీయంగా తగ్గినట్లు నిరూపితమైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల దినచర్యలో ఎలాంటి మార్పు చేయలేదు.

చిలగడదుంప

స్వీట్ పొటాటోలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మీరు బంగాళాదుంపలకు బదులుగా చిలగడదింపలను తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, చాలా నీటిని కలిగి ఉంటాయి, సులభంగా జీర్ణం అవుతాయి. జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో చిలగడదుంపలు కొవ్వు కణాలను కుదించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తేలింది. కాబట్టి చిలగడదుంపలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి.

చింతపండు

చింతపండులో హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ (HCA) అనే సమ్మేళనం ఉంటుంది, ఇది ఆకలిని అణిచివేస్తుంది, బరువు పెరుగుటను తగ్గిస్తుంది. ఇది మెదడులో సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలను కూడా పెంచుతుంది, ఇది మీకు తక్కువ ఆకలిని కలిగిస్తుంది.

దోసకాయ

దోసకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి, నీటి శాతం ఎక్కువ ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. దోసకాయ తినడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండవచ్చు, అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

తదుపరి వ్యాసం