తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Watermelon Health Benefits: పుచ్చకాయతో 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Watermelon health benefits: పుచ్చకాయతో 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu

08 March 2023, 14:30 IST

    • Watermelon health benefits: పుచ్చ కాయ ఆరోగ్య ప్రయోజనాలు, ఉపయోగాలు తెలిస్తే దీనిని రోజూ మీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ముఖ్యంగా వేసవి సమీపించిందంటే వాటర్ మెలన్ విరివిగా లభిస్తుంది.
పుచ్చకాయతో 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
పుచ్చకాయతో 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Unsplash)

పుచ్చకాయతో 8 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Watermelon health benefits: పుచ్చ కాయ మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం ఇస్తుంది. మీ దాహాన్ని తీర్చుతుంది. చాలా మందికి ఇంతవరకే తెలుసు. కానీ దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

1. శరీరంలో నీటి కోసం పుచ్చ కాయ

శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పుచ్చకాయ సాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండాలన్నా, అవయవాలు సక్రమంగా పనిచేయాలన్నా, కణాలకు పోషకాలు అందాలన్నా శరీరంలో తగినంత నీరు ఉండాల్సిందే. తాగే నీటి ద్వారా, నీటి కంటెంట్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. ఇందుకు సరైన ఆప్షన్ పుచ్చకాయ. ఇందులో 92 శాతం నీరే ఉంటుంది. పైగా పుచ్చకాయలో క్యాలరీలు తక్కువ. అందువల్ల మీకు కడుపు నిండినట్టుగా ఉంటుంది. బరువు కూడా పెరగరు.

2. వాటర్‌మెలన్‌లో పోషకాలు పుష్కలం

పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి సహా పలు రకాల పోషకాలు ఉన్నాయి. పైగా వీటిలో క్యాలరీలు చాలా తక్కువ. అమైనో యాసిడ్ అయిన సిట్రులైన్ మన శారీరక చురుకుదనాన్ని పెంచుతుంది. విటమిన్ సి, కెరొటినాయిడ్, లైకోపీన్, కుకుర్బిటాసిన్ సహా పలు యాంటీఆక్సిడెంట్లు పుచ్చకాయలోని పోషకాలు. ఈ సమ్మేళనాలన్నీ ఫ్రీరాడికల్స్‌తో పోరాడేందుకు సాయపడతాయి. ఫ్రీరాడికల్స్ శరీరంలో పేరుకుపోయినప్పుడు కణాలను దెబ్బతీసి డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి.

3. పుచ్చ కాయ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్, బీపీని తగ్గించడానికి వాటర్‌మెలన్‌లోని లైకోపీన్ సహాయపడుతుందని అధ్యయనాలు సూచించాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయి వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా నివారించడంలో లైకోపీన్ సాయపడుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రలిన్ అమైనో యాసిడ్ శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పెంచేందుకు దోహదపడుతుంది. ఇది మీ రక్త నాళాలు విస్తరించడానికి సహాయపడుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది.

4. పుచ్చ కాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు

పుచ్చకాయలో ఉండే లైకోపీన్, కుకుర్బిటాసిన్ సహా పుచ్చకాయలో కనిపించే సమ్మేళనాలు యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా లైకోపీన్ ప్రొస్టేట్, కొలొరెక్టర్ క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. కుకుర్బిటాసిన్ కణితి పెరుగుదలను నివారిస్తుంది.

5. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే పుచ్చకాయ

అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూలమైన ఇన్‌ఫ్లమేషన్ (వాపు, మంట)ను తగ్గించడంలో వాటర్‌మెలన్‌లోని లైకోపీన్, విటమిన్ సీ కలయిక సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ లైకోపీన్ అల్జీమర్స్ వ్యాధి త్వరగా రాకుండా, అలాగే వచ్చినా ముదరకుండా సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచించాయి.

6. కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే పుచ్చకాయ

పుచ్చకాయలో ఉంటే సిట్రులైన్ అమైనో యాసిడ్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని నైట్రిక్ యాక్సైడ్ పెంచడం ద్వారా కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తనాళాలు విస్తరించడంలో సాయపడుతుంది. 

7. పుచ్చకాయతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది

పుచ్చ కాయలో అధిక మొత్తంలో నీరు, తక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. నీరు మీ జీర్ణ వ్యవస్థలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.

8. కంటి, చర్మ ఆరోగ్యానికి మేలు

పుచ్చకాయలో ఉంటే విటమిన్ ఏ, విటమిన్ సీ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం కొలాజెన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మీ జుట్టు బలంగా ఉండడంలో దోహదపడుతుంది. అలాగే మీ కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం