తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kia Xceed 2023 : తనదైన దూకుడు, స్టైలింగ్, టెక్​ ఫార్వర్డ్​తో కియా Xceed 2023

Kia XCeed 2023 : తనదైన దూకుడు, స్టైలింగ్, టెక్​ ఫార్వర్డ్​తో కియా XCeed 2023

19 July 2022, 10:32 IST

    • Kia XCeed 2023 : UKలో కియా XCeed అత్యంత ప్రజాదరణ పొందిన కారు. యూరప్‌లో 120,000 యూనిట్లకు పైగా విక్రయించిన తర్వాత.. Kia అత్యంత విజయవంతమైన XCeed కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ బోల్డ్ కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్, మెరుగైన ఇంటీరియర్​ను ప్రముఖ మోడల్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మార్పులు జనాదరణ పొందిన C-క్రాస్ఓవర్ విభాగంలో XCeed 2023ని మరింత ఆకర్షణీయమైన ప్రతిపాదనగా మారుస్తాయి.
Kia XCeed 2023
Kia XCeed 2023

Kia XCeed 2023

Kia XCeed 2023 : కియా మోటార్స్ ఐరోపాలో వివిధ వర్గాల వాహనాలతో పోటీపడి విజయవంతమైంది. తనదైన దూకుడు, స్టైలింగ్, టెక్-ఫార్వర్డ్ క్యాబిన్‌ల ద్వారా మంచి విలువను అందిస్తోంది. ఈ కొరియన్ వాహన తయారీదారు మొదటిసారిగా XCeedని దాని ప్రసిద్ధ Ceed మోడల్‌కు ప్రత్యామ్నాయంగా 2019లో వివిధ రకాల పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లను ఎంచుకోవడానికి పరిచయం చేసింది. ఇప్పుడు పలు మార్పులతో కియా XCeed 2023ని రూపొందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

2023 Kia XCeed బాహ్యభాగాలు

కారులో అన్ని LED లైటింగ్, 18-అంగుళాల చక్రాలు ఉన్నాయి. 2023 Kia XCeed చుట్టూ బ్లాక్ క్లాడింగ్‌తో విలక్షణమైన క్రాస్‌ఓవర్ స్టైలింగ్ ఉంది. ఇది పొడవాటి బానెట్, సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్, DRLలతో ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్లు, విశాలమైన ఎయిర్ డ్యామ్, స్కిడ్ ప్లేట్‌ను కలిగి ఉంది. ORVMలు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రూపొందించారు.

ర్యాప్-అరౌండ్ LED టెయిల్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా వెనుక భాగంలో ఉన్నాయి. దీనిని బహుళ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందిస్తున్నారు. XCeed 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్లు (118hp/172Nm), 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (158hp/253Nm), 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ (201hp/265Nm)పై నడుస్తుంది. 1.6-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ మోటార్ (134hp/280Nm), 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్, 44.5kW మోటార్, 8.9kWh బ్యాటరీతో కూడిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెటప్ (139hp/265Nm) కూడా అందుబాటులో ఉన్నాయి.

2023 Kia XCeed ఇంటీరియర్స్

క్రాస్‌ఓవర్‌లో సన్‌రూఫ్, ADAS ఉన్నాయి. లోపలి భాగంలో కియా XCeed పూర్తిగా నలుపు రంగులో ఉండే ఇంటీరియర్‌ను లెథెరెట్ అప్హోల్స్టరీ, డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌లపై మెటల్ యాక్సెంట్‌లు, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది.

ఇది తాజా కనెక్టివిటీ ఎంపికలతో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ను ప్యాక్ చేస్తుంది. బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, అనేక ADAS ఫంక్షన్‌ల ద్వారా ప్రయాణీకులకు భద్రతనిస్తుంది.

2023 Kia XCeed ధర

2023 Kia XCeed ధర, లభ్యతకు సంబంధించిన వివరాలను కియా మోటార్స్ రాబోయే నెలల్లో వెల్లడిస్తుంది. UKలో క్రాస్ఓవర్ ధర సుమారు £25,000 (సుమారు రూ. 23.9 లక్షలు) ఉంటుందని అంచనా.

టాపిక్

తదుపరి వ్యాసం