తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Itbp Recruitment 2022: Itbpలో కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

ITBP Recruitment 2022: ITBPలో కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu

15 August 2022, 22:02 IST

    • ITBP Constable Recruitment 2022: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు పోస్టుల భర్తీాకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ITBP Recruitment 2022
ITBP Recruitment 2022

ITBP Recruitment 2022

ITBP Constable Recruitment 2022: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ (పయనీర్) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల పురుషులు ఆగస్టు 19, 2022 నుండి ITBP recruitment.itbpolice.nic.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు

ICMR On Weight Loss : వారంలో ఎంత బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది.. తగ్గేందుకు టిప్స్

Mandaram Health Benefits : జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా మందారం పువ్వుతో అనేక లాభాలు

Honey and Aloe Vera Gel : ముఖం, మెడపై ఒక వారంపాటు తేనె, కలబంద జెల్ రాస్తే మెరిసిపోతారు

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 19, 2022

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 17, 2022

ITBP కానిస్టేబుల్ ఖాళీల వివరాలు

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో 108 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది .

కానిస్టేబుల్ (కార్పెంటర్): 56 పోస్టులు

కానిస్టేబుల్ (మేసన్): 31 పోస్టులు

కానిస్టేబుల్ (ప్లంబర్): 21 పోస్టులు

వేతనం:

ITBP కానిస్టేబుల్ పే స్కేల్ లెవెల్ -3, పే మెట్రిక్‌ రూ. 21700-69100 (7వ CPC ప్రకారం)

అర్హత

కానిస్టేబుల్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ డిగ్రీ లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి, అలాగే గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి మేసన్ లేదా కార్పెంటర్ లేదా ప్లంబర్ ట్రేడ్‌లో ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సును కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామ్ (DME)/రివ్యూ మెడికల్ ఎగ్జామ్ (RME) ఆధారంగా ఎంపిక చేయబడతారు.

తదుపరి వ్యాసం