తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఉన్నతమైన ఫీచర్లతో Iqoo Neo 6 స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర కేవలం అంతే!

ఉన్నతమైన ఫీచర్లతో iQOO Neo 6 స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర కేవలం అంతే!

HT Telugu Desk HT Telugu

31 May 2022, 14:59 IST

    • ప్రీమియం రేంజ్ ఫీచర్లతో iQOO Neo6 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలయింది. ఇది 5Gకి సపోర్ట్ చేస్తుంది.  దీని ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
iQOO Neo 6 5G
iQOO Neo 6 5G

iQOO Neo 6 5G

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు iQOO తమ బ్రాండ్ నుంచి నియో స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో సరికొత్త iQOO Neo 6 స్మార్ట్‌ఫోన్‌ను చేర్చింది. తాజాగా ఈ ఫోన్ భారత మార్కెట్లో విడుదలయింది. ఈ హ్యాండ్‌సెట్‌లో మరింత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoCను అమర్చడంతో పాటు దీనిని గరిష్టంగా గరిష్టంగా 12 GB వరకు విస్తరించుకోగలిగే RAMతో జత చేశారు. అందువల్ల ఈ ఫోన్ వాడుతున్నపుడు వేగవంతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభూతి చెందుతారు.

ట్రెండింగ్ వార్తలు

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

iQoo Neo 6 ర్యామ్,  స్టోరేజ్ ఆధారంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే సైబర్ రేజ్, డార్క్ నోవా అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర వివరాలను ఈ కింద పొందుపరిచాం, తెలుసుకోండి.

iQOO Neo6 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.62-అంగుళాల ఫుల్ HD+ E4 AMOLED స్క్రీన్
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌
  • 8GB/12GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • Funtouch OS 12 ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
  • వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ లెన్స్‌, 2MP సెన్సార్, ముందువైపు 16 MP సెల్ఫీ షూటర్
  • 4700mAh బ్యాటరీ, 80W ఛార్జర్‌

కనెక్టివిటీ పరంగా iQOO Neo6లో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS , USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్‌లను పరిశీలిస్తే బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ బరువు 190 గ్రాములు

8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999/-

12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999/-

వినియోగదారులు iQOO Neo6ను అమెజాన్ ఇండియా అలాగే కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమైనాయి. జూన్ 5 లోపు కొనుగోలు చేసే కస్టమర్‌లు లాంచ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం