తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No Diet Day | కొంపల్ని ముంచే సైజ్​ జీరో.. ఈ డైట్​లన్ని చెత్తబుట్టలో వెయ్యరో..

No Diet Day | కొంపల్ని ముంచే సైజ్​ జీరో.. ఈ డైట్​లన్ని చెత్తబుట్టలో వెయ్యరో..

HT Telugu Desk HT Telugu

06 May 2022, 16:00 IST

    • ప్రజలు ఫిట్​గా ఉండాలనే లక్ష్యంతో వివిధ రకాల డైట్స్​తో కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. మరికొందరు ఎవరికో ఓ డైట్​ కలిసి వచ్చిందని.. అదే డైట్​ ఫాలో అవుతూ ఉంటారు. ఫిట్​గా ఉండేవారిని చూసి.. తమ బాడీ సరిగా లేదనే అభద్రతా భావంతో కృంగిపోతారు. అలా ఫీల్​ అవ్వకుండా ఉండాలని అవగాహన కల్పిస్తూ.. ఏటా అంతర్జాతీయ నో డైట్​ డేను నిర్వహిస్తున్నారు.
నో డైట్ డే
నో డైట్ డే

నో డైట్ డే

International No Diet Day | మీ సహజ శరీర రకాన్ని మార్చుకునేందుకు, కడుపు మాడ్చుకుని డైట్​లు చేసే ఆలోచనను మార్చాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మే 6వ తేదీన అంతర్జాతీయ నో డైట్ డేని జరుపుతున్నారు. శరీర రకం, ఆకృతితో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా డైటింగ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. నీలి రంగు రిబ్బన్ ధరించి.. తమ శరీరాన్ని అంగీరిస్తూ.. జరుపుకుంటారు.

చరిత్ర

1992లో ఇంగ్లీష్ ఫెమినిస్ట్ మేరీ ఎవాన్స్ యంగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సహజమైన శరీర రకాన్ని అంగీకరించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ నో డైట్ డేని ప్రారంభించారు. 1992లో కొంతమంది యూకే మహిళలు "డిచ్ దట్ డైట్" స్టిక్కర్‌లతో ఈ రోజును జరిపారు. 1993 నాటికి ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం ప్రారంభమైంది.

ఎజెండా

శరీర అవగాహన, ఆహార నియంత్రణకు సంబంధించిన క్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి పురుషులు, మహిళలు ఇద్దరికీ సహాయపడే ఉద్దేశ్యంతో ఈ రోజును ప్రారంభించారు. ఇది అనారోగ్యకరమైన డైటింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, బాధ్యతాయుతంగా ఆహారం ఎలా తీసుకోవాలో నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం డైట్​ చేసే వాళ్లు వారానికి ఒకసారి చీట్ డేని తీసుకుని నచ్చిన ఆహారం తీసుకునేలా ప్రోత్సాహిస్తుంది.

ప్రజలు ఈ రోజు జరుపుకోవడానికి ఎందుకు ఇష్టపడతారు?

అంతర్జాతీయ నో డైట్ డే మీకు నచ్చిన ఏదైనా తినే అవకాశాన్ని ఇస్తుంది. స్వీయ-ప్రేమ కంటే ఏదీ ముఖ్యమైనది కాదని గుర్తు చేస్తూ.. మీరు ఎలా కనిపిస్తారనేది పట్టింపు లేదని కూడా ఈ రోజు మీకు గుర్తు చేస్తుంది. ఇది బాడీ పాజిటివిటీని ప్రోత్సహిస్తుంది. ప్రతి పరిమాణం, ఆకారం ప్రత్యేకంగా, అందంగా ఉందని వారికి గుర్తు చేస్తుంది. ఇది ఆహారాలపై నియంత్రణకు బదులుగా వారి జీవితంలోని ఇతర విషయాలపై దృష్టి పెట్టడానికి ప్రజలను అనుమతిస్తుంది.

మీరు కూడా అనారోగ్యకరమైన డైటింగ్ వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించండి. కొన్ని వాఫ్ఫల్స్, పాన్‌కేక్‌లను తినండి. #NoDietDay హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం