తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips To Get Better Sleep : రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? అయితే ఇవి ఫాలో అయిపోండి..

Tips To Get Better Sleep : రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? అయితే ఇవి ఫాలో అయిపోండి..

11 October 2022, 20:00 IST

    • Tips To Get Better Sleep : మంచి నిద్ర అంటే అర్థం మంచి ఆరోగ్యం. అవును మరి నిద్రలోనే సగం రోగాలు నయం అవుతాయి. సరైన నిద్ర లేకపోవడం వల్లే చాలా రోగాలు వస్తాయి. అయితే చాలా మంది నిద్ర సరిగా రాక ఇబ్బందులు పడతారు. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. మంచి నిద్రకోసం ఈ నియమాలను పాటించండి. 
మెరుగైన నిద్రకోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి
మెరుగైన నిద్రకోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి

మెరుగైన నిద్రకోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tips To Get Better Sleep : రాత్రి పడుకునే మంచి, మెరుగైన నిద్ర మిమ్మల్ని రోజంతా రిఫ్రెష్‌గా ఉంచేందుకు సహాయం చేస్తుంది. మంచి నిద్ర ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుకు సంకేతం. చాలా మంది రాత్రులు మంచిగా నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ నిద్ర రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే మెరుగైన నిద్ర కావాలనుకుంటే.. కొన్ని ముఖ్యమైన అంశాలను కచ్చితంగా పాటించాలి అంటున్నారు పరిశోధకులు. మంచి నిద్ర కావాలనుకునేవారు కొన్ని విషయాలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

టైం టూ టైం

మంచి నిద్ర కోసం క్రమం తప్పకుండా పడుకోవడం, అదే సమయంలో నిద్రలేవడం అవసరం. సెలవు దినాల్లో కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఇది నిద్ర కోసం మీ శరీరాన్ని అదే సమయానికి సిద్ధం చేస్తుంది. ఫలితంగా నిద్రపట్టకపోవడం.. మళ్లీ మళ్లీ నిద్రపోవడం వంటి సమస్యలు ఉండవు.

నో లైట్స్

పడుకునే గంట ముందు.. గదిలోని లైట్లను ఆఫ్ చేయండి. లేదంటే లైట్లను డిమ్ చేయండి. దీని వల్ల మెదడులో మెలటోనిన్ విడుదలై మంచి నిద్ర వస్తుంది. నిద్రపోయే 1 గంట ముందు మొబైల్-గాడ్జెట్‌లను ఉపయోగించడం ఆపివేయండి. బదులుగా.. మీరు మంచి నిద్ర కోసం ఏదైనా తేలికపాటి పుస్తకాన్ని చదవవచ్చు.

గది ఉష్ణోగ్రత

మంచి నిద్ర కోసం గది ఉష్ణోగ్రత కూడా అవసరం. గది చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉంటే నిద్ర పట్టదు. చల్లటి గది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుందని వివిధ అధ్యయనాలు చూపిస్తున్నాయి. అందుకే చలికాలంలో నిద్ర బాగా పడుతుంది. ఇంట్లో ఏసీ ఉంటే.. ప్రతిరోజూ నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచాలి.

డ్రింక్ చేయకండి

ఆల్కహాల్ తాగే వారికి తరచుగా నిద్ర భంగం, రకరకాల కలలు వస్తాయి. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత టీ, కాఫీ తాగడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది.

ఉదయం కచ్చితంగా ఇది చేయండి..

ఉదయం నిద్రలేచిన తర్వాత మంచం మీద ఉండకండి. చాలా మంది నిద్రలేచాక మంచం మీద ఉండడం వల్లే మళ్లీ నిద్రపోతారు. మంచం దిగి కిటికీ తెరిచి.. శ్వాస తీసుకోండి. ముఖం కడుక్కుని.. తేలికపాటి వాక్ చేయండి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నిద్రలేచిన తర్వాత మొబైల్‌లో మునిగిపోవడం అస్సలు కరెక్ట్ కాదు.

తదుపరి వ్యాసం