తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Scrubs For Blackheads: బ్లాక్‌ హెడ్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ స్క్రబ్స్‌తో మాయం..

Scrubs for blackheads: బ్లాక్‌ హెడ్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ స్క్రబ్స్‌తో మాయం..

01 November 2023, 17:35 IST

  • Scrubs for blackheads: ముక్కుమీద, ముక్కు పక్కన, గడ్డం దగ్గర బ్లాక్ హెడ్స్ సమస్య ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని ఇంట్లోనే చేసిన స్క్రబ్స్ తో ఈ సమస్య తగ్గించుకోవచ్చు.

బ్లాక్‌హెడ్స్ స్క్రబ్స్
బ్లాక్‌హెడ్స్ స్క్రబ్స్ (pexels)

బ్లాక్‌హెడ్స్ స్క్రబ్స్

ముఖ సౌందర్యంపై అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అయినా కొంత మందికి మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖాన్ని కాంతి విహీనంగా చేస్తూ ఉంటాయి. మరి అసలు బ్లాక్‌ హెడ్స్‌ ఎందుకు ఏర్పడతాయో తెలుసుకుని, వాటిని నివారించే ఫేస్‌ స్క్రబ్‌ల గురించి కూడా తెలుసుకుందాం పదండి.

బ్లాక్‌ హెడ్స్‌ ఎందుకు వస్తాయంటే :

మనకు చెమట పట్టినప్పుడు చర్మపు రంధ్రాల లోపలి నుంచి కొన్ని శరీర ద్రవాలు బయటకు ఊరతాయి. అందులో నీరు, లవణాలు, నూనెలు.. లాంటివి ఉంటాయి. ఇలాంటి చర్మపు రంధ్రాల దగ్గర దుమ్ము, ధూళి, కాలుష్య కారక కణాలు పేరుకుపోవడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌ వస్తాయి. మరి వీటిని తీసి వేసేందుకు ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని స్క్రబ్‌లు ఉపయోగపడతాయి.

సహజమైన స్క్రబ్‌లు తయారు చేసుకోండిలా :

కొబ్బరి నూనె స్క్రబ్‌:

కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి కొబ్బరి నూనెతోనే ఫేస్‌ స్క్రబ్‌ని తయారు చేసేసుకోవచ్చు. అందుకు రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు టేబుల్‌ స్పూన్ల పంచదారను వేయండి. రెండింటినీ పేస్ట్‌లా కలిపి ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత పంచదార కాస్త ఆరినట్లుగా అవుతుంది. అప్పుడు కాస్త ఒత్తిడిని కలిగిస్తూ ముఖాన్ని రుద్దుతూ స్క్రబ్‌ చేసుకోండి. మరీ గట్టిగానూ రుద్ద కూడదని గుర్తుంచుకోండి. తర్వాత ఫేస్‌ వాష్‌తో ముఖాన్ని కడిగేసుకోండి. కొబ్బరి నూనె మాయిశ్చరైజర్‌లాగానూ పని చేస్తుంది. ముఖానికి మృదుత్వాన్ని ఇస్తుంది.

కమలా పండు తొక్కలతో:

ఒక స్పూను కమలా పండు తొక్కల పొడిని తీసుకోండి. దానిలో ఒక టీ స్పూను ఓట్‌ మీల్‌ పొడి, పెరుగులను వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట సేపు ఆరనివ్వండి. తర్వాత రుద్దుతూ ముఖాన్ని కడుక్కోండి. ఇది బ్లాక్‌ హెడ్స్‌ని తొలగించడమేకాకుండా చర్మపు పూడిపోయిన రంధ్రాలను శుభ్రం చేస్తుంది. మృత కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

నిమ్మకాయ, ఉప్పుతో:

ఒక చెక్క నిమ్మ రసంలో ఒక చెక్క ఉప్పును వేయండి. రెండింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించండి. 20 నిమిషాల తర్వాత స్క్రబ్‌ చేసుకున్నట్లుగా ముఖాన్ని రుద్దుతూ ప్యాక్‌ని తీసేయండి. తర్వాత మంచి ఫేస్‌ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోండి. అందువల్ల బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోవడమే కాకుండా మొటిమలు, మచ్చలూ కూడా తగ్గుముఖం పడతాయి.

తదుపరి వ్యాసం