తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ భర్త మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించాలంటే ఇలా చేయండి!

మీ భర్త మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించాలంటే ఇలా చేయండి!

06 January 2022, 19:17 IST

    • పెళ్లయ్యాక ఆ బంధంలో కొనసాగాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోవాలి. కాపురంలో కలతలు రావడం సహజమే. కొన్నిసార్లు మీరు మీ భాగస్వామితో పంచుకునే అనవసరపు మాటలు పెద్ద గొడవగా మారి మీ బంధాన్ని తెగదింపులు చేసుకునే వరకు తీసుకువెళ్తాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు బాధ్యతగా మెలగాలి.
భార్యాభర్తలు- ప్రతీకాత్మక చిత్రం
భార్యాభర్తలు- ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తలు- ప్రతీకాత్మక చిత్రం

అగ్ని సాక్షిగా, పవిత్ర వేద మంత్రోచ్ఛరణల మధ్య మూడు ముళ్ళ బంధంతో ఏకమవుతున్న చాలా జంటలు, కొద్ది కాలానికే వారి వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. అన్యోన్యంగా సాగాల్సిన వారి సంసారం మూణ్ణాళ్లకే వీధిన పడుతుంది. ఒకరికొకరు అన్నట్లుగా ఉండాల్సిన దంపతులు ఎవరి జీవితం వారిదేనని విడాకుల కోసం కోర్టుల తలుపులు తడుతున్నారు. చిన్నచిన్న సమస్యలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

పెళ్లయ్యాక ఆ రిలేషన్ షిప్ కొనసాగాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోవాలి. కాపురంలో కలతలు రావడం సహజమే. కొన్నిసార్లు మీరు మీ భాగస్వామితో పంచుకునే అనవసరపు మాటలు పెద్ద గొడవగా మారి మీ బంధాన్ని తెగదింపులు చేసుకునే వరకు తీసుకువెళ్తాయి. వివాహబంధంలో కొనసాగుతున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు బాధ్యతగా మెలగాలి.

అయితే ఒక ఆడపిల్ల భార్య స్థానం పొందినపుడు తన ఇంటి పేరు మారడమే కాకుండా, తన జీవితంలోకి మరొక కొత్త కుటుంబం వస్తుంది. ఆ కుటుంబంపై తనకు అన్ని అధికారాలు లభిస్తాయి. కాబట్టి వారు మరింత బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది. అప్పుడే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది. భార్యలు తమ భర్తలతో అనుబంధాన్ని పదిలంగా ఉంచుకోవాలంటే పాటించాల్సిన కొన్ని నియమాలను ఇక్కడ చర్చించుకుందాం.

భార్య స్థానంలో ఉన్నవారు ఈ నియమాలకు కట్టుబడి ఉండాలి

పుట్టింటిని అతిగా పొగడటం మానుకోండి: పెళ్లయ్యాక భర్త ముందు మీ పుట్టింటి వాళ్లను అతిగా పొగడకండి. ఇది తప్పు అని కాదు, కానీ తరచూ మీ పుట్టింటి వాళ్ల గురించి ఎక్కువగా చెప్తూ, వారు గొప్ప అంటూ వాదిస్తే అది మీ భర్తను, మెట్టినింటిని తక్కువ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఏదైనా పరిమితికి లోబడే మాట్లాడాలి.

మెట్టినింటిని గౌరవించడం: బంధువులు, ఇతరుల వద్ద మీ భర్త తోబుట్టువులు, తల్లిదండ్రుల గురించి చెడుగా చెప్పడం మానుకోండి. ఇది భర్తకు ఇష్టం ఉండదు. తోటి కోడలితో అనోన్యంగా ఉంటూ ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకోండి. మీ అత్తమామలను కించపరిచేలా ప్రవర్తించవద్దు. ఇలాంటివే, రిలేషన్ షిప్‌లో చీలికకు కారణమవుతాయి.

మీ భర్తను ఎవరితో పోల్చకూడదు: పెళ్లయ్యాక మీ భర్తను ఏ విషయంలోనూ ఇతరులతో పోల్చకూడదు. ఇది మీ భర్తకు బాధ కలిగించవచ్చు. అలాగే మీ మధ్య బంధాన్ని బలహీనపరచడానికి ఇదే కారణం కావచ్చు.

భర్తకు ప్రాముఖ్యత ఇవ్వండి: మీ భర్తకు ఎల్లప్పుడూ తగినంత గౌరవం ఇవ్వండి. మీ బంధువుల ముందు మర్యాదపూర్వకంగా మెలగండి. భర్తను ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం గానీ, చాడీలు చెప్పటం గానీ చేయవద్దు. ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేయవచ్చు.

భార్యగా మీరు ఈ నియమాలకు నిజాయితీగా కట్టుబడితే మీ భర్త ఎలాంటి వాడైనా కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.

తదుపరి వ్యాసం