తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Strengthen Immunity। మీ రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి!

Strengthen Immunity। మీ రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి!

HT Telugu Desk HT Telugu

15 August 2023, 11:08 IST

    • Strengthening your immunity: రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలానుగుణ వ్యాధులను నివారించడానికి చర్యలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకునే మార్గాలు చూడండి..
Strengthening your immunity
Strengthening your immunity (istock)

Strengthening your immunity

Strengthening your immunity: ఈరోజుల్లో చాలా మందికి రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. ఫలితంగా కొద్దిగా వాతావరణం మారినా, బయట ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తిన్నా, అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పుడున్నది వర్షాకాలం, ఈ సీజన్ లో అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలానుగుణ వ్యాధులను నివారించడానికి తమ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం కోసం చర్యలు తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Aster CMI హాస్పిటల్‌లోని సర్వీసెస్, క్లినిక్ న్యూట్రిషన్, డైటెటిక్స్ హెడ్ డాక్టర్ ఎడ్వినా రాజ్ HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడారు, వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కొన్ని చిట్కాలను సూచించారు.

పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి

వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. మీ ఆహారంలో కూరగాయలు , పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చండి. ఈ ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి మీ శరీరం రోగనిరోధక రక్షణకు సహాయపడతాయి. నారింజ, జామ, కివి, బొప్పాయి, నిమ్మకాయలు వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే, అల్లం, వెల్లుల్లి, పసుపులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి వ్యాధికారక క్రిములను అంతం చేస్తాయి.

అలాగే పప్పులు, బీన్స్, మొలకలు, బఠానీలు, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకోవచ్చు. ఇవి కాకుండా, మీ శరీరం నుండి విషాన్ని ఫ్లష్ చేయడానికి పుష్కలంగా నీరు త్రాగటం చాలా అవసరం. సరైన హైడ్రేషన్ మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు, హెర్బల్ టీలు తాగుతుండాలి.

మంచి పరిశుభ్రత పాటించండి

వర్షాకాలంలో, వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. మీ చేతులు ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియాలను ఎన్నింటినో కలిగి ఉండవచ్చు. కాబట్టి తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి, ముఖ్యంగా భోజనానికి ముందు సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం చాలా అవసరం. సబ్బు, నీరు అందుబాటులో లేకుంటే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ని వాడండి. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

తగినంత నిద్ర పోవాలి

తగినంత నిద్ర ఉండండం, ఒత్తిడి నియంత్రించుకోవడం అనేవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలు, వీటిపై దృష్టిపెట్టాలి. వర్షాకాలంలో ప్రతి రాత్రి 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోయేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. సరిపోని నిద్ర మీ రోగనిరోధక వ్యవస్థ బలాన్ని తగ్గిస్తుంది, అలాగే దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక పనితీరును అణిచివేస్తుంది కాబట్టి ఒత్తిడి నిర్వహణ కూడా ముఖ్యమైనది. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు లేదా యోగా వంటి పద్ధతులను అభ్యసించడం ద్వారా ఆందోళన నుండి ఉపశమనం పొందండి. ఈ పద్ధతులు రోగనిరోధక శక్తిని పెంచే కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

క్రమంతప్పకుండా వ్యాయామం

రోజువారీ శారీరక శ్రమ, క్రమంతప్పకుండా వ్యాయామం మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీ ఆరోగ్యాన్ని పెంచడానికి సమర్థవంతమైన మార్గం. వర్షాకాలంలో రోజుకు కనీసం 30 నిమిషాల పాటు మీడియం తీవ్రత వ్యాయామం చేయాలి. భారీ వర్షం కారణంగా బహిరంగ కార్యకలాపాలు సాధ్యం కానట్లయితే, ఇండోర్ వ్యాయామాలు లేదా డ్యాన్స్ లేదా ఏరోబిక్స్ వంటి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోండి. యోగా ఒక గొప్ప ప్రత్యామ్నాయం ఎందుకంటే ఇది మీ శరీర ఫ్లెక్సిబిలిటీని మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గింస్తుంది. వివిధ ఆన్‌లైన్ ఇండోర్ వ్యాయామ అభ్యాసాలను అనుసరిస్తూ మీ ఫిట్‌నెస్ స్థాయిలను కాపాడుకోవచ్చు.వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, రోగనిరోధక కణాలు శరీరంలోని వివిధ ప్రదేశాలకు మరింత సమర్థవంతంగా చేరుకోవడానికి అనుమతిస్తుంది.

తదుపరి వ్యాసం