తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffee Per Day | రోజుకి కాఫీ ఎన్ని కప్పులు తీసుకోవాలి?అతిగా తాగితే

Coffee per day | రోజుకి కాఫీ ఎన్ని కప్పులు తీసుకోవాలి?అతిగా తాగితే

28 February 2022, 18:05 IST

  • మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే కప్పు కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. మరికొందరికి కాఫీ తాగకపోతే ఆ రోజు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మనలో చాలా మందికి రోజుకి ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? అనే అనుమానం ఉంటుంది.

రోజుకి ఎన్ని కప్పులు కాఫీ తాగాలి
రోజుకి ఎన్ని కప్పులు కాఫీ తాగాలి (pixabay)

రోజుకి ఎన్ని కప్పులు కాఫీ తాగాలి

కాఫీలోని కెఫిన్‌ను మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే గుణం ఉంటుంది. అయితే కాఫీని మోతాదుకు మించి తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగితే మన ఆరోగ్యానికి మంచిదే. రోజూ 400 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన తలనొప్పి, నిద్ర లేమి, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాల నొప్పి తదితర దుష్పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అలాగే ఇన్‌స్టంట్ కాఫీ కంటే సంప్రదాయ కాఫీ, ఫిల్టర్ కాఫీలే మంచిది. 

ట్రెండింగ్ వార్తలు

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

కాఫీకి దూరంగా ఉంటే మంచిది

అతిగా కాఫీ తాగితే రక్తపోటు పెరుగుతుందని ఓ పరిశోధన తేల్చింది. అందుకే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్లు కాఫీ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. జీర్ణ సంబంధ వ్యాధులు ఉన్నవారు కూడా కాఫీకి దూరంగా ఉండాలి. నిద్ర లేమితో బాధపడేవారు కూడా కాఫీ తాగకూడదు. ప్రెగ్నెంట్ లేడీస్ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మహిళలు రోజుకు 200 మిల్లీ గ్రాములకు మించిన కెఫిన్ తీసుకోకూడదట. అంటే.. రోజుకు 2 కప్పులకు మించకూడదు. డెలివరీ అయ్యే వరకు కాఫీ తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు డాక్టర్లు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ ఇవ్వకూడదు. కాఫీ తాగని పిల్లలతో పోల్చితే.. తాగే పిల్లల్లో ఎదుగుదల సక్రమంగా లేదని వైద్యులు తేల్చారు.

సంబంధిత కథనం

తదుపరి వ్యాసం