తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Republic Day 2024: జయహో భారత్... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా తెలుగులోనే చెప్పేయండి

Happy Republic Day 2024: జయహో భారత్... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా తెలుగులోనే చెప్పేయండి

Haritha Chappa HT Telugu

26 January 2024, 5:00 IST

    • Republic day 2024 Wishes: భారత గణతంత్ర దినోత్సవం ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఇది జాతీయ సెలవు దినం.
హ్యాపీ రిపబ్లిక్ డే
హ్యాపీ రిపబ్లిక్ డే (unsplash)

హ్యాపీ రిపబ్లిక్ డే

Republic day 2024 Wishes: ఎంతోమంది పోరాట వీరుల త్యాగఫలమే మన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మనం... మనకంటూ సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘భారత గణతంత్ర దినోత్సవం’. మొదటిసారి ఈ రిపబ్లిక్ డే ను 1950 జనవరి 26న నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది వైభవంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. దీన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ గణతంత్ర దినోత్సవాన మీ ఆత్మీయులకు, స్నేహితులకు సంతోషంగా శుభాకాంక్షలు చెప్పండి. వాట్సాప్ మెసేజ్‌లలో, సోషల్ మీడియాలో తెలుగులోనే శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడ మేము కొన్ని రిపబ్లిక్ డే విషెస్ ఇచ్చాము. ఇందులో మీకు నచ్చినది ఎంపిక చేసుకొని మీ ఆత్మీయులకు పంపించండి.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

1. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం

పౌర హక్కులను కాపాడుకుందాం

మన దేశానికి మనమే రక్ష

హ్యాపీ రిపబ్లిక్ డే

2. మన స్వేచ్ఛ స్వతంత్రాల కోసం

అసువులు బాసిన సమరయోధుల

దీక్షా దక్షతలను స్మరిస్తూ ...

3. రాజ్యాంగం ప్రసాదించిన ప్రతి హక్కు ఒక ఆయుధమే

ఆ హక్కులను అర్థం చేసుకొని అమలులో పెట్టుకునేది మనమే

హ్యాపీ రిపబ్లిక్ డే

4. మన రాజ్యాంగం మనందరికీ

అమల్లోకి, అందుబాటులోకి వచ్చిన శుభదినమే

గణతంత్ర దినోత్సవం.

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

5. కులం నిన్ను అంటరాని వానిగా చేయవచ్చు

మతం నిన్ను బానిసలుగా మార్చవచ్చు

కానీ రాజ్యాంగం మాత్రం నిన్ను మనిషిలా బతికేలా చేస్తుంది

హ్యాపీ రిపబ్లిక్ డే

6. భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది.

అందులో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రధానమైనది.

దాన్ని మన కళ్ళ ముందు జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను, అవినీతిని, దౌర్జన్యాలను ప్రశ్నించడానికి ఉపయోగిస్తూనే ఉందాం.

భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

7. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే.

ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఈరోజు.

భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

8. మాతృభూమి కోసం తన ధన,మాన, ప్రాణాలను

త్యాగం చేసిన ఎందరో మహానుభావులు.

వారందరినీ ఈరోజు తలుచుకుందాం

హ్యాపీ రిపబ్లిక్ డే

9. దేశం పై ఉన్న ప్రేమ

మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆశిస్తూ

హ్యాపీ రిపబ్లిక్ డే

10. మన భారతీయులకు స్వేచ్ఛ,

స్వాతంత్య్రాలను ఇచ్చింది రాజ్యాంగమే.

ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే ఈరోజు.

హ్యాపీ రిపబ్లిక్ డే

టాపిక్

తదుపరి వ్యాసం