తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food To Calm Anxiety: ఒత్తిడి, ఆందోళనగా ఉందా.. ఇవి తింటే రిలీఫ్‍గా ఉంటుంది!

Food to calm Anxiety: ఒత్తిడి, ఆందోళనగా ఉందా.. ఇవి తింటే రిలీఫ్‍గా ఉంటుంది!

25 May 2023, 14:50 IST

    • Food to calm Stress: ఒత్తిడి, ఆందోళనలో ఉన్నారా.. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే అవి తగ్గుతాయి. అవేంటో ఇక్కడ చూడండి.
Food to calm Anxiety: ఒత్తిడి, ఆందోళనగా ఉందా.. ఇవి తింటే రిలీఫ్‍గా ఉంటుంది! (HT Photo)
Food to calm Anxiety: ఒత్తిడి, ఆందోళనగా ఉందా.. ఇవి తింటే రిలీఫ్‍గా ఉంటుంది! (HT Photo)

Food to calm Anxiety: ఒత్తిడి, ఆందోళనగా ఉందా.. ఇవి తింటే రిలీఫ్‍గా ఉంటుంది! (HT Photo)

Food to calm Stress: ప్రస్తుత కాలంలో ఉద్యోగం సహా చాలా పరిస్థితుల వల్ల అధిక శాతం మంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఆందోళన చెందుతుంటారు. ఇది సాధారణమైంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు విభిన్న రకాలైన ట్రీట్‍మెంట్లు ఉన్నాయి. అయితే, ఆరోగ్యకరమైన జీవన విధానం, బ్యాలెన్స్డ్ డైట్ పాటించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. కొన్ని రకాల ఫుడ్స్ ఒత్తిడిని, ఆందోళలను తగ్గిస్తాయి. అవేంటో ఇక్కడ చూడండి.

బ్లూబెర్రీలు

బ్లూబెర్రీలు రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. యాంటీయాక్సిడెంట్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అథోసియానిస్ ఈ పండ్లలో అధికంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను తింటే ఒత్తిడి తగ్గుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‍తో ఈ యాంటియాక్సిడెంట్లు పోరాడతాయి. దీంతో బ్లూబెర్రీలు తింటే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు.

అరటి పండ్లు

అరటి పండ్లలో మెగ్నిషియమ్ అధికంగా ఉంటుంది. ఈ పండు తింటే మీ మూడ్ మారుతుంది. ఒక్కో పెద్ద అరటి పండులో 37 గ్రాముల మెగ్నిషియమ్ ఉంటుంది. ఇది మీ బ్లడ్ ప్రెజర్‌ను అదుపు చేసేందుకు సాయపడుతుంది. అరటి పండు తింటే ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ పొందవచ్చు.

సిట్రస్ ఫ్రూట్స్

చీని, బత్తాయి, నిమ్మ, దానిమ్మ లాంటి సిట్రస్ పండ్లు.. ‘విటమిన్ సీ’ని కలిగి ఉంటాయి. ఒత్తిడి మేనేజ్‍మెంట్‍కు ఈ పండ్లు సాయపడతాయి. ఇవి తింటే కోర్టిసోల్ లెవెల్స్ తగ్గి.. శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు

గోధుమలు, ఓట్స్, బార్లీ, సహా తృణధాన్యాలు లాంటి కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారంలో తీసుకున్నా కాస్త ఒత్తిడి తగ్గుతుంది. మీ బ్లడ్‍స్ట్రీమ్‍లోకి ఇవి ఎనర్జీని నెమ్మదిగా విడుదల చేస్తాయి. మెదడులో హ్యాపీ హోర్మోన్ అయిన సెరటోనిన్‍ను పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయి.

బీన్స్, చిక్కుళ్లు

బీన్స్, కాయధాన్యాలతో పాటు చిక్కుళ్లలో ఎక్కువగా యాంటియాక్సిడెంట్లు, విటమిన్ బీ6, మెగ్నిషియమ్ ఉంటాయి. అందుకే ఇలాంటి పోషకాలు ఉన్న వాటిని ఆహారంలో తీసుకుంటే మీలోని ఒత్తిడి తగ్గి.. పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు.

సాల్మోన్ చేప

సాల్మోన్ లాంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈపీఏ, డీహెచ్‍ఏ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఈ సాల్మోన్ చేపను ఆహారంలో తీసుకుంటే మెదడు పని తీరు మెరుగుపడుతుంది. దీంతో ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.. మెదడును ప్రశాంతంగా మారుస్తాయి. ఒత్తిడిని నియంత్రిస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం