తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సమ్మర్​లో మునగకాయలు తింటే మంచిది అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సమ్మర్​లో మునగకాయలు తింటే మంచిది అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

HT Telugu Desk HT Telugu

31 March 2022, 14:35 IST

    • వేసవి వచ్చేసింది. కాబట్టి రుచికరమైన కూరగాయాలతో పాటు.. ఆరోగ్యానికి మేలు చూసే వాటిని తీసుకోవడం మంచిది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మునగకాయలు గురించి. దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. మీరు ప్రతి కూరలో మీరు దానిని యాడ్ చేసుకుంటారు. మునగకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుని.. సమ్మర్​ను ఆరోగ్యంగా మార్చేద్దాం.
మునగకాయలతో బెనిఫిట్స్
మునగకాయలతో బెనిఫిట్స్

మునగకాయలతో బెనిఫిట్స్

Drumsticks Benefits |  సాధారణంగా మునగకాయలను సాంబార్​లలో చూస్తుంటాం. ఎప్పుడో ఒకసారి కర్రీ చేసుకుంటాం. ఒక్కోసారి మటన్, చికెన్ కర్రీలలో మునగకాయలను వేస్తూ ఉంటారు. మునగకాయలే కాదండోయ్.. ఆకులు కూడా మీకు మేలు చేస్తాయి. మునగకాయలను ఫ్రై చేసినా.. ఉడకబెట్టినా.. అవి తమ సామర్థ్యాన్ని కోల్పోవు. ఈ రెండింటినీ సూప్‌లలో కూడా ఉపయోగించవచ్చు. ఈ వెజ్జీని మీ ఆహారంలో భాగంగా చేసుకునే మార్గాలు చాలా ఉన్నాయని పోషకాహార నిపుణుడు పారుల్ మల్హోత్రా బహ్ల్ సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

మునగకాయల వల్ల కలిగే ప్రయోజనాలు..

* ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

* రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

* ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది.

* రక్తశుద్ధిలో సహాయపడుతుంది.

* శ్వాసకోశ రుగ్మతలను నివారిస్తాయి.

* లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.

మునగకాయతో ఈ డిష్​లు ట్రై చేయండి..

మునగకాయతో సూప్​ తయారు చేసుకోవచ్చు. మునగకాయలే కాకుండా.. మునగ బెరడు, మునగ ఆకులను కూడా సూప్​లో చేర్చవచ్చు. కూరల్లో మునగ బెరడును కూడా చేర్చుకోవచ్చు. ఇది కర్రీకి కొత్త రుచిని ఇస్తుంది. అంతేకాకుండా దాని పోషక విలువను పెంచుతుంది. దీనిని రోటీ, అన్నం లేదా మీకు నచ్చిన ఏదైనా మిల్లెట్‌లతో ఆస్వాదించవచ్చు.

పప్పు లేదా సాంబార్‌లో మునగకాయ వేస్తే.. దాని రుచి మరింత పెరుగుతుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మునగ ఆకులను.. ఇతర ఆకుకూరల మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు. కొందరు మునగకాయలతో ఊరగాయలను కూడా పడతారు. మునగ ఆకులను మినపప్పు, బియ్యం పిండితో మిళితం చేసి, దోసగా చేసుకుంటారు. దీన్ని వేరుశెనగ లేదా కొబ్బరి చట్నీతో పాటు సాంబార్‌తో తినవచ్చు. మాంసాహార ప్రియులు మటన్/చికెన్ కర్రీని మునగకాయలతో కలిపి వండుతారు. దీనివల్ల మాంసం మరింత రుచిగా మారుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం