తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dr Br Ambedkar Jayanti : అంబేద్కర్ జయంతి.. ఇలా మీ ఫ్రెండ్స్​కు సందేశం పంపండి

DR BR Ambedkar Jayanti : అంబేద్కర్ జయంతి.. ఇలా మీ ఫ్రెండ్స్​కు సందేశం పంపండి

HT Telugu Desk HT Telugu

14 April 2023, 9:31 IST

    • DR BR Ambedkar Jayanti : ఏప్రిల్ 14 దేశం మొత్తం.. గొప్ప నాయకుడు అంబేద్కర్ జయంతిని జరుపుకొంటోంది. ఆయన సేవలను, ఆయన చెప్పిన గొప్ప గొప్ప మాటలను గుర్తు చేసుకుంటుంది.
అంబేద్కర్ జయంతి
అంబేద్కర్ జయంతి (twitter)

అంబేద్కర్ జయంతి

భారతదేశపు అత్యంత గొప్ప నాయకులలో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ ఒకరు. ఆయనకు ఎవరూ సాటి రారు. స్వేచ్ఛ, సమానత్వం గురించిన ఆలోచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఈ రోజు, దేశం మొత్తం ఆ గొప్ప నాయకుడి జయంతిని జరుపుకొంటోంది. ఆయన బోధనలను గుర్తుం చేసుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

దేశంలోని కోట్ల మంది ప్రజలు డాక్టర్ అంబేద్కర్.. ఉన్నత నైతిక ప్రమాణాలు, సూత్రాల నుండి ప్రేరణ పొందుతున్నారు. రాజ్యాంగం రచించడంలో ఆయన స్థానం ప్రత్యేకం. డాక్టర్ అంబేద్కర్ స్వాతంత్ర్యం తరువాత భారతదేశానికి మొదటి న్యాయ మంత్రి కూడా. DR. BR అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లోని మహర్ దళిత కుటుంబంలో జన్మించారు. చదువుకోవాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేది. ఎంతో కష్టపడి చదివారు. అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరిగా మారడానికి అనేక అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొన్నారు. అంబేడ్కర్ సూక్తులు, కోట్‌లు లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకమైన కోట్స్

మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సంఘం పురోగతిని కొలుస్తాను.

మీరు సామాజిక స్వేచ్ఛను సాధించనంత కాలం, చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా మీకు ప్రయోజనం ఉండదు.

నాకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించే మతం అంటే ఇష్టం.

విద్యావంతులుగా ఉండండి, వ్యవస్థీకృతంగా ఉండండి.. ఆందోళన మాత్రం చెందకండి.

మానసిక స్వాతంత్య్రమే నిజమైన స్వాతంత్య్రం.

ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాద సూత్రాలను పొందుపరిచే రాజ్యాంగాన్ని కలిగి ఉన్నందుకు నా దేశం గురించి నేను గర్విస్తున్నాను.

ఒక మొక్కకు నీరు ఎంత అవసరమో.. ఒక గొప్ప ఆలోచనకు ప్రచారం అవసరం. లేకుంటే రెండూ వాడిపోయి.. చనిపోతాయి.

ఉదాసీనత అనేది ప్రజలను ప్రభావితం చేసే చెత్త రకమైన వ్యాధి.

ఇలా సందేశం పంపండి..

మనలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని, వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పే సంకల్పాన్ని అందించండి. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు

భారతదేశ అభివృద్ధికి డా.అంబేద్కర్ చేసిన అపురూపమైన కృషిని గౌరవించడం ద్వారా ఆయన కృషి మరియు త్యాగాలను మనం స్మరించుకుందాం.

లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌లో స్ఫూర్తిని పొందుతున్నారు, మన సంతోషం, మన బాధలు రెండింటికీ మనం మాత్రమే కారణమని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.

సమాజ అభ్యున్నతికి కృషి చేసే శక్తి మీకు ప్రసాదించాలి.. మీ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు, .

వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, సమాజంలో సమానత్వాన్ని నిరంతరం ప్రోత్సహించడానికి నిబద్ధతతో ఉండండి. మీకు అంబేద్కర్ దినోత్సవ శుభాకాంక్షలు.

తదుపరి వ్యాసం