తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Children's Day 2023 : బాలల దినోత్సవ శుభాకాంక్షలు.. ఇలా విషెస్ చెప్పండి

Happy Children's Day 2023 : బాలల దినోత్సవ శుభాకాంక్షలు.. ఇలా విషెస్ చెప్పండి

Anand Sai HT Telugu

14 November 2023, 8:40 IST

    • Happy Children's Day 2023 : నవంబర్ 14న భారతదేశం బాలల దినోత్సవం జరుపుకొంటుంది. పిల్లలు అంటే అందరికీ ఇష్టమే. వారి చిరునవ్వు చూస్తే.. ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి. అయితే ఈ ప్రత్యేకమైన రోజున ఈ శుభాకాంక్షలు షేర్ చేయండి.
చిల్డ్రన్స్ డే
చిల్డ్రన్స్ డే

చిల్డ్రన్స్ డే

భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నవంబర్ 14, 1889న జన్మించారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం, ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. పిల్లలే దేశానికి నిజమైన శక్తిగా, సమాజానికి పునాదిగా నెహ్రూ భావించారు. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమ కారణంగా ఆయన పుట్టినరోజును భారతదేశంలో బాలల దినోత్సవంగా నిర్వహిస్తాం. ఈరోజున కింది విధంగా శుభాకాంక్షలు చెప్పండి.

నేటి బాలలే.. రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ఏది గుడి, ఎవరు దేవుడు.. నా ఈ జీవితానికి నీ చిరునవ్వు చాలు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

పిల్లలు ప్రత్యేకమైనవారు, వారికి మెరుగైన జీవితాన్ని అందించడం ద్వారా వారి బాల్యాన్ని చిరస్మరణీయం చేద్దాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు..

మీ ఇంటిలోని పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు!

పిల్లలు, దేవుడు ఒక్కటే. పిల్లల చిరునవ్వులో దేవుడిని చూస్తాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

పిల్లలందరూ దేశానికి సంపద. భారతదేశ భవిష్యత్ మూలస్తంభాలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది పిల్లల ముఖంలో చిరునవ్వు. ప్రపంచంలోని ప్రతి బిడ్డకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు

అసూయ, పగ, మోసం అనే ఆలోచనలు లేకుండా సంతోషంగా ఉండేవారు పిల్లలు.. వారికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన కాలం వారి బాల్యం. పిల్లలందరికీ Happy Children's Day

మీరు కొనుగోలు చేసే బహుమతుల కంటే మీ పిల్లలకు మీ నుండి ఎక్కువ సమయం కావాలి. వారు మీకు ఎంత ప్రత్యేకంగా ఉన్నారో వారికి గుర్తు చేయండి. Happy Children's Day 2023

పిల్లలను మంచిగా మార్చడానికి ఉత్తమ మార్గం వారిని సంతోషపెట్టడం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

పిల్లలకు ముందుగా ఆలోచించడం నేర్పాలి, ఆ తర్వాత ఎలా ఆలోచించాలో నేర్పించాలి, ఆ తర్వాత ఏం ఆలోచించాలో నేర్పించాలి. Happy Childrens Day

పిల్లలు ప్రకాశవంతమైన రేపటి కోసం మన ఆశలను, సంతోషకరమైన భవిష్యత్తు కోసం మన కలలను మోస్తారు. పిల్లలకు చాలా సంతోషకరమైన రోజు ఇది.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ఈ రోజు మనమందరం మన పిల్లల అమాయకత్వాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం.. మన జీవితంలోని ప్రతి క్షణంలో అవి విలువైనవి. ఎందుకంటే వారే మన భవిష్యత్తు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

మీతో గడపడం కంటే పిల్లలకు విలువైనది ఏదీ లేదు.. సమయం ఇచ్చి చూడు.. మీరు వారికి దేవుడవుతారు.. Happy Children's Day

సమయం లేదనడం కాదు.. సమయాన్ని సృష్టించుకుని పిల్లలతో గడపాలి.. హ్యాపీ చిల్డ్రన్స్ డే

బాల్యం తిరిగిరానిది.., మరువలేనిది.., మళ్లీ మళ్లీ గుర్తుచేసుకునేది.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

బాల్యం లేనిది.. బతుకే లేదు.. అందమైన బాల్యాన్ని పిల్లలకు ఇద్దాం.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు

తదుపరి వ్యాసం