తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Solana | బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ సొలానా నుంచి ప్రత్యేకమైన Saga స్మార్ట్‌ఫోన్‌

Solana | బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ సొలానా నుంచి ప్రత్యేకమైన Saga స్మార్ట్‌ఫోన్‌

Manda Vikas HT Telugu

28 June 2022, 16:02 IST

    • క్రిప్టోకరెన్సీ, ఎన్‌ఎఫ్‌టి ట్రేడింగ్ కోసం అలాగే డిజిటల్ ఆస్తులకు పటిష్ట భద్రత కల్పించేందుకు సొలానా ల్యాబ్స్ ప్రత్యేకమైన 'సాగా' అనే మొబైల్ విడుదల చేసింది. ఈ ఫోన్ విశేషాలేమిటో తెలుసుకోండి..
Solana's Saga mobile
Solana's Saga mobile

Solana's Saga mobile

బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ సొలానా ల్యాబ్స్ అనుబంధ సంస్థ అయిన సోలానా మొబైల్ ఇటీవల ఒక సరికొత్త డివైజ్ ఆవిష్కరణ చేసింది. స్మార్ట్‌ఫోన్‌లలో క్రిప్టోకరెన్సీ అలాగే నాన్-ఫంగబుల్ టోకెన్ (ఎన్‌ఎఫ్‌టి) ట్రేడింగ్‌ను మరింత సులభతరం చేసే విధంగా 'సాగా' (Solana Saga) అనే ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ను విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

ఈ ఫోన్ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ, భద్రతపరంగా పటిష్టమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ సాగా ఫోన్ ద్వారా web3లో లావాదేవీలు జరపడం అలాగే టోకెన్‌లు, NFTల వంటి డిజిటల్ ఆస్తులను మెయింటేన్ సులభం, సురక్షితం అని చెబుతున్నారు.

ఈ Saga ఫోన్ అనేది ప్రముఖ Android డెవలప్‌మెంట్ కంపెనీ OSOM భాగస్వామ్యం ద్వారా తయారు చేశారు. ఈ కంపెనీ Google, Apple, Intel కోసం కంప్యూటింగ్ హార్డ్‌వేర్‌ను రూపొందించడంలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంది.

Saga స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే, 12 GB RAM, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ వంటి ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ హ్యాండ్‌సెట్‌లో డిజిటల్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి. ఈ ఫోన్‌లో ఇన్ బిల్ట్‌గా సీడ్ వాల్ట్, ప్రైవేట్ కీలు, సీడ్ ఫ్రేజెస్, ఇతర సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా ఉంచే సెక్యూరిటీ లేయర్ ఉంటుంది. అయినప్పటికీ ఈ ఫోన్‌లో మిగతా అన్ని రకాల యాప్‌లను, మొబైల్ బ్రౌజర్‌ను యధావిధిగా ఉపయోగించవచ్చు.

Solana Saga స్మార్ట్‌ఫోన్‌ ధరను $1,000గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 79,000/-. ఇప్పటికే కంపెనీ ముందస్తు ఆర్డర్‌లకు బుకింగ్ ప్రారంభించింది. ఇందుకోసం $100 రీఫండబుల్ డిపాజిట్ చేయాలని కోరుతోంది.

"ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 బిలియన్ల మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఇందులో 100 మిలియన్లకు పైగా ప్రజలు డిజిటల్ ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. web3లో లావాదేవీల ప్రమాణాలను తమ Saga పెంచుతుంది." అని సోలానా సహ వ్యవస్థాపకుడు అనాటోలీ యాకోవెంకో అన్నారు.

తదుపరి వ్యాసం