తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruits In Periods: పీరియడ్స్‌లో ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి అండ..

Fruits in Periods: పీరియడ్స్‌లో ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి అండ..

HT Telugu Desk HT Telugu

10 October 2023, 16:00 IST

  • Fruits in Periods: పీరియడ్స్ సమయంలో పండ్లు తింటే కాస్త ఉత్సాహంగా అనిపిస్తుంది. నీరసం తగ్గుతుంది. ఇంతకీ ఈ సమయంలో ఏ పండ్లు తినొచ్చో తెలుసుకోండి. 

పీరియడ్స్ సమయంలో తినాల్సిన పండ్లు
పీరియడ్స్ సమయంలో తినాల్సిన పండ్లు (shutterstock)

పీరియడ్స్ సమయంలో తినాల్సిన పండ్లు

పీరియడ్స్‌ సమయంలో మహిళలు నీరసంగా, అసహనంగా, అసౌకర్యంగా ఉంటారు. ఈ సమయంలో తలెత్తే హార్మోన్ల మార్పులు వల్లనే ఈ విధంగా ఉంటుంది. అందుకనే ఇలాంటి సమయంలో వీరు ఆరోగ్యకరమైన డైట్‌ని పాటించాలి. సాధారణ సమయంలో కంటే ఈ సమయంలో మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. అలాగే కొన్ని పండ్లను ఈ సమయంలో తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. మరి ఏఏ పండ్లను తీసుకోవడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం రండి.

ట్రెండింగ్ వార్తలు

Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

Pregnancy Tips : గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి ఎందుకు తినకూడదో అసలైన కారణాలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

కివీ :

నెలసరి సమయంలో ఇబ్బందిగా ఉన్న మహిళలు తప్పకుండా కివీ పండ్లను తీసుకుంటూ ఉండాలి. వీటిలో ముఖ్యంగా విటమిన్‌ కే, ఫోలేట్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాక, అధిక రక్త స్రావాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా వీరికి నీరసం లాంటివి తగ్గుముఖం పడతాయి. అలాగే వీటిలో ఉండే ఇతర పోషకాలు, పీచు పదార్థాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందజేస్తాయి.

స్ట్రాబెరీ :

ఈ సమయంలో స్ట్రాబెరీలు మహిళలకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలూ ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈ సమయంలో స్త్రీల్లో ఉండే ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గిస్తాయి. ఇలాంటి లక్షణాలే బెర్రీలు అన్నింటిలోనూ ఉంటాయి. బ్లాక్‌ బెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్‌బెర్రీలు.. తదితరాలనూ ఈ సమయంలో తినవచ్చు.

నిమ్మజాతి పండ్లు :

నిమ్మ, కమల, బత్తాయి, నారింజ, గ్రేప్‌ ఫ్రూట్‌.. లాంటి సిట్రస్‌ జాతి పండ్లను నెలసరి సమయంలో మహిళలు తీసుకోవచ్చు. ఇవి మూడ్‌ స్వింగ్స్‌ని నియంత్రిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి తిన్న ఆహారంలోని ఐరన్‌ని శోషించుకుని శరీరంలోకి చేర్చేందుకు సహకరిస్తాయి. దీని వల్ల శరీరంలో రక్తం వృద్ధి అవుతుంది. రక్తహీనతలాంటివి రాకుండా ఉంటాయి.

అరటి పండ్లు :

రుతు సమయంలో కొందరికీ చాలా నీరసంగా ఉంటుంది. అలాంటి వారు అరటిపండ్లను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల శరీరానికి కొద్ది సమయంలోనే శక్తి చేకూరుతుంది. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్‌ బీ6 కూడా ఎక్కువ. ఇవి విసుగు, చికాకుల్ని తగ్గిస్తాయి. అలసటను తగ్గించడంలో సహకరిస్తాయి.

పుచ్చకాయలు :

నెలసరి సమయంలో శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం ఎంతో ముఖ్యం. పుచ్చకాయలో ద్రవ పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు. అలాగే ఈ సమయంలో వచ్చే నొప్పుల నుంచి పుచ్చకాయతో ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే దీనిలో విటమిన్‌ సీ, లైకోపిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు, అమీనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి.

తదుపరి వ్యాసం