తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Bone Soup | బోన్​ సూప్​తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే తాగకుండా ఉండలేరు..

Bone Soup | బోన్​ సూప్​తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే తాగకుండా ఉండలేరు..

04 March 2022, 13:29 IST

    • నాన్​ వెజ్​ తినే వారికి బోన్​ సూప్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎముకలు ఉడకబెట్టిన పులుసు చాలా ప్రజాధారణ పొందింది. ముఖ్యంగా ఆరోగ్య స్పృహ కలిగిన ప్రతి నాన్​వెజ్​ పర్సన్స్​ దీనిని ఎక్కువగా వాడుతారు. పోషకాహార నిపుణులు సైతం అందం, ఆరోగ్యం కోసం దీనిని తాగమని సిఫారసు చేస్తారు. అసలు బోన్​ సూప్​తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బోన్ సూప్
బోన్ సూప్

బోన్ సూప్

చాలామంది ఎముకలు ఉడకబెట్టిన పులుసును.. మాంసం కూరను ఒకటే రకమైన బెనిఫిట్స్ ఇస్తాయని భ్రమపడుతుంటారు. కానీ ఈ రెండు వేరు. ఏది ఏమైనా బోన్స్ పులుసునకు ఉండే ప్రత్యేకతనే వేరు. దాని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు. ఏదైనా ప్రమాదానికి గురై ఎముకలు విరిగినప్పుడు.. డాక్టర్లు సైతం ఈ బోన్​ సూప్​నే తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే బోన్స్​సూప్​లో ఎక్కువ పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.  దీనిని ఎలా తయారు చేయాలో డైటీషియన్, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు ఎంఎస్ రుబైనా తెలిపారు. శాఖాహారులకు కూడా ఇలాంటి సూప్​ తయారీ విధానం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : ఇలాంటివారు జీవితాంతం దు:ఖంలోనే ఉంటారు మరి

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

బోన్ సూప్ తయారీ

ముందుగా మాంసంతో లేదా మాంసం లేకుండా ఉన్న ఎముకలను బాగా శుభ్రం చేసి.. ఒక కుండలో వేయాలి. దానిలో మీకు నచ్చిన ఏదైనా మసాలా, రోజ్మేరీ, థైమ్, పార్స్లీ వంటి మూలికలను జతచేయాలి. అనంతరం తరిగిన క్యారెట్లు, బ్రోకోలి వంటివి వేసి నీరు పోయాలి. అనంతరం మూత పెట్టి ఉడికించాలి. ఎముకల నుంచి పోషకాలు ద్రవంలోకి చొచ్చుకుపోతాయి. ఈ విధంగా మీరు పోషకాలతో కూడిన ఆరోగ్యవంతమైన సూప్​ను తయారు చేసుకోవచ్చు.

బోన్​ సూప్​ వల్ల ప్రయోజనాలు

1. రోగనిరోధక వ్యవస్థను బలపడుతుంది

బోన్ సూప్​లు సులభంగా జీర్ణమవుతాయి. పైగా దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఔషదంలా పనిచేస్తుంది. కాలానుగుణ వ్యాధులను నివారించడమే కాకుండా.. మీకు దగ్గు, జలుబు లేదా ఫ్లూ వచ్చినప్పుడు కోలుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

2. యాంటీ ఏజింగ్

"ఎముకలు ఉడకబెట్టిన పులుసులో కనిపించే కొల్లాజెన్ ఆరోగ్యానికి మాత్రమే ముఖ్యమైనది కాదు.. ప్రేగు కదలికలకు కూడా సహాయపడుతుంది. అలా కాకుండా ఎముక రసంలో ఉండే ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మంచి గట్ ఫ్లోరా ఏర్పడటానికి సహాయపడతాయి. ఇవి యాంటీ ఏజింగ్​ని అభివృద్ధి చేస్తాయి.

3. ఎముకలు దృఢంగా  మారుతాయి

పేరుకు తగినట్లుగానే ఎముకలు ఉడకబెట్టిన పులుసు.. ఎముకలకు మంచిది. దంతాల కోసం కూడా అద్భుతమైన ఆహార వనరు. ఇది కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. ఇది మీ సొంత ఎముకలను బలంగా, ఆరోగ్యంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది.

4. కీళ్ల నొప్పులకు సైతం

కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు వైద్యులు దీనిని సూచిస్తున్నారు. ఎముకలు ఉడకబెట్టిన పులుసు గ్లూకోసమైన్‌తో నిండి ఉంటుంది. ఎముకల పులుసును తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లలో లూబ్రికేషన్ పెరగడానికి ఇది బాగా సహాయపడుతుంది.

గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్ వంటి ఇతర రసాయనాలతో పాటుగా కొల్లాజెన్, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కీళ్ల అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని రోజూ తీసుకోవడం వల్ల మీ కీళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

5. ఫిట్‌నెస్ స్థాయిలు పెరుగుతాయ్

ఎముక పులుసులో పెద్ద మొత్తంలో ప్రోటీన్ (కప్పుకు 6 గ్రాములు) ఉంటుంది. ఎముక రసం మీ శరీరానికి అమైనో ఆమ్లాలను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో కండరాల పునరుద్ధరణ, శక్తిలో ఈ అమైనో ఆమ్లాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

శాకాహారుల కోసం

బోన్ సూప్​ పేరు ఎత్తగానే మీకు కోపం వస్తే.. కచ్చితంగా మీరు శాకాహారి అయి ఉండొచ్చు. అయితే చింతించకండి. మీరు కూడా ఎముక రసంలో ఉండే అన్ని ప్రయోజనాలు శాఖాహారి సూప్​తో పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

‘శాకాహారి పులుసు’ అనే కొత్త పదం తప్పుదారి పట్టించేది కాదు. ప్రత్యామ్నాయ మొక్కల ఆధారిత మూలకాలతో దీనిని తయారు చేస్తారు. అది ఎముకలు లేకుండా.. శోథ నిరోధక, గట్-హీలింగ్, యాంటీఆక్సిడెంట్-బూస్టింగ్ మరియు జాయింట్-హీలింగ్ లక్షణాలను కలిగి ఉండవచ్చు. ఈ శాకాహారి ఉడకబెట్టిన పులుసును తయారు చేయడానికి కూరగాయలు, ముఖ్యంగా పుట్టగొడుగులు, సీవీడ్, సహజ మూలికలు, సుగంధాలను ఉపయోగిస్తారు. ఇంకేముంది మీరు దానిని తయారు చేసుకుని వేడిగా ఆస్వాదించేయండి. 

తదుపరి వ్యాసం