తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Leafy Vegetables Benefits : ఆకు కూరలు ప్రతిరోజూ తింటే ఎన్నో అద్భుతాలు

Leafy Vegetables Benefits : ఆకు కూరలు ప్రతిరోజూ తింటే ఎన్నో అద్భుతాలు

Anand Sai HT Telugu

28 November 2023, 14:00 IST

    • Eating Leafy Vegetables Benefits : ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీ డైలీ డైట్‌లో రెగ్యులర్‌గా వాటిని చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఆకు కూరలు
ఆకు కూరలు

ఆకు కూరలు

పోషకాలు అధికంగా ఉండే సూపర్‌ఫుడ్ లిస్టులో ఆకు కూరలు ఉంటాయి. ఇవి మీ రోజువారీ ఆహారంలో రెగ్యులర్ భాగంగా ఉన్నప్పుడు, బరువు తగ్గడం నుండి కంటి ఆరోగ్యం వరకు అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువసేపు నిండుగా అనుభూతి చెందడానికి సహాయపడతాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఆకు కూరలు బచ్చలికూర, బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే, క్యాబేజీ. ఆకు కూరల వల్ల కలిగే అనేక ప్రయోజనాలను, వాటిని మీ ఆహారంలో ఎందుకు చేర్చుకోవాలో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువు ఉన్నవారు తరచుగా బరువు తగ్గడానికి కఠినమైన ఆహార పద్ధతులు, తీవ్రమైన వ్యాయామం చేస్తారు. కానీ అవి కొలెస్ట్రాల్‌ను ఏమాత్రం తగ్గించలేవు. క్యాబేజీ సులభంగా కరిగించలేని కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ క్యాబేజీని తినకూడదనుకుంటే, బ్రోకోలీ, కాలీఫ్లవర్ వంటి ఆకు కూరలు తినవచ్చు.

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే క్యాబేజీ లేదా బ్రోకలీని జ్యూస్ చేయవచ్చు. అంతేకాకుండా దీన్ని రోజూ స్మూతీగా, బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే పొట్ట భాగంలో కొవ్వు కొద్దికొద్దిగా కరగడం ప్రారంభమవుతుంది. ఈ జ్యూస్‌లో కాస్త నిమ్మరసం, పచ్చిపాలకూర, జీలకర్ర పొడి కలిపి తాగితే రుచిగా ఉంటుంది.

మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే, ఇన్ఫెక్షన్లు మనపై దాడి చేయవు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి క్యాబేజీ, బ్రోకోలీ, క్యాలీఫ్లవర్ వంటి ఆకు కూరలను తీసుకోండి. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి ఎంతగానో సహకరిస్తాయి.

క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయి. ఇది పొత్తికడుపులోని కొవ్వును కరిగించి, మూత్రం ద్వారా టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది.

ఆకు కూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండటమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు దొరుకుతాయి. కొన్ని ఆకు కూరలు రుచికి కూడా చాలా బాగుంటాయి. మనం తినేందుకు అనేక రకాల ఆకు కూరలు ఉంటాయి. కానీ తినేందుకు మాత్రం చాలా మంది ఇష్టపడరు. రోజూ తినే ఆహారంలో ఆకు కూరలను చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

తదుపరి వ్యాసం