తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beat The Heat : సమ్మర్​ హీట్​ను బీట్​ చేసే.. సహజమైన డ్రింక్స్ ఇవే..

Beat The Heat : సమ్మర్​ హీట్​ను బీట్​ చేసే.. సహజమైన డ్రింక్స్ ఇవే..

08 June 2022, 15:09 IST

    • మే దాటేసినా.. ఎండల్లో ఎటువంటి మార్పులు లేవు. వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవిలో చల్లగా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఆరోగ్యకరమైన, సహజమైన డ్రింక్స్ తాగాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో మీరు ఓ లుక్కేయండి.
సమ్మర్ డ్రింక్స్
సమ్మర్ డ్రింక్స్

సమ్మర్ డ్రింక్స్

Summer Drinks | మండే సూర్యుడు మరియు వెచ్చని గాలులు డీహైడ్రేషన్​కు గురయ్యేలా చేస్తాయి. ఒక్కోసారి హీట్ స్ట్రోక్ వల్ల మరణం కూడా సంభవించవచ్చు. అయితే వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మనలో చాలా మంది చల్లని శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌ల వైపు మొగ్గు చూపుతారు. కానీ ఏ మాత్రం హెల్త్​కి మంచిది కాదు. ఈ సమయంలో మనం చల్లగా ఉండేందుకు సహాయపడే ఆరోగ్యకరమైన, సహజమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అవి తెలుసుకుని.. ఈ వేడిని తగ్గించుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

పచ్చి కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీరు లేకుండా వేసవికాలాన్ని ఊహించలేము. కొబ్బరి నీరు తేలికపాటి ఉప్పు, తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇది రీహైడ్రేషన్ కోసం అద్భుతమైన పానీయం. దీనిలో విటమిన్ సి, పొటాషియం, సోడియం, క్లోరైడ్, కార్బోహైడ్రేట్‌లు వంటి శక్తినిచ్చే, శరీరానికి అవసరమైన పోషకాలు దీనిలో ఉంటాయి. ఇది పూర్తిగా యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం, వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది.

నిమ్మరసం

వేసవిలో వీధి వ్యాపారులు చల్లని నిమ్మకాయ నీటిని విక్రయిస్తూనే ఉంటారు. దీనిని తాజా నిమ్మరసం, నీరు, ఉప్పుతో సులభంగా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయల్లో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

పుచ్చకాయ

దీనిలో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. వేసవిలో సహజంగా హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడే రసవంతమైన పండ్లలో ఇది ఒకటి. ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే.. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలోని ముఖ్యమైన అమైనో ఆమ్లం అర్జినైన్‌గా మారుతుంది. ఇది మన గుండె, రోగనిరోధక పనితీరు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ప్రయోజనకరమైన ప్రభావాలను చూపిస్తుంది.

మామిడి

పండిన మామిడి పండ్లలో దాదాపు 83 శాతం నీరు ఉంటుంది. పైగా ఇది వేసవిలో దొరికే రుచికరమైన ఆహారం. మామిడితో చేసే స్మూతీస్ వేసవిలో ప్రసిద్ధ పానీయాలు అని చెప్పవచ్చు. పండని, పచ్చి మామిడికాయలతో కూడా జ్యూస్​ తయారు చేసుకుంటారు.

మజ్జిగ

సాంప్రదాయ పానీయం పెరుగు. నీరు, ఉప్పు, పెరుగు ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. లస్సీలా కాకుండా.. ఇది తేలికైన పానీయం. పైగా ఇది తియ్యగా ఉండదు. హైడ్రేషన్ కాకుండా ఎండ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. పానీయంలో ప్రోబయోటిక్స్ ఉన్నందున జీర్ణక్రియకు కూడా ఇది మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం