తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bathukamma Songs Telugu : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. మెుత్తం పాట మీకోసం

Bathukamma Songs Telugu : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. మెుత్తం పాట మీకోసం

Anand Sai HT Telugu

12 October 2023, 9:30 IST

    • Bathukamma Song Lyrics : కొన్ని బతుకమ్మ పాటలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. పాటలోని హుక్ లైన్ సేమ్ ఉన్నా.. లిరిక్స్ తేడా ఉంటాయి. అలాంటి పాటలను HT Telugu సేకరిస్తోంది.
బతుకమ్మ పాట
బతుకమ్మ పాట

బతుకమ్మ పాట

బతుకమ్మ మీద బోలేడు పాటలు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. లిరిక్స్ మారుతూ ఉంటాయి. కానీ మెుదటి లైన్ మాత్రం ఒక్కటే ఉంటుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పాట తెలంగాణ వ్యాప్తంగా పాడుతారు. ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరిక్స్ మీ కోసం..

ట్రెండింగ్ వార్తలు

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

ఆనాటి కాలాన ఉయ్యాలో..

ధర్మాంగుడను రాజు ఉయ్యాలో..

ఆ రాజు భార్యయు ఉయ్యాలో..

అతి సత్యవతి యనేరు ఉయ్యాలో..

నూరు నోములు నోమి ఉయ్యాలో..

నూరు మందిని కాంచె ఉయ్యాలో..

వారు శూరులై ఉయ్యాలో..

వైరులచే హతమైరి ఉయ్యాలో..

తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో..

తరగని శోకమున ఉయ్యాలో..

ధన రాజ్యములను బాసి ఉయ్యాలో..

దాయాదులను బాసి ఉయ్యాలో..

వనితతో ఆ రాజు ఉయ్యాలో..

వనమందు నివసించే ఉయ్యాలో..

కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో..

ఘన తపంబొనరించే ఉయ్యాలో..

ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో..

పలికే వరమడుగమని ఉయ్యాలో..

వినిపించి వేడుచూ ఉయ్యాలో..

వెలది తన గర్భమున ఉయ్యాలో..

పుట్టమని వేడగా ఉయ్యాలో..

పూబోణి మది మెచ్చి ఉయ్యాలో..

సత్యవతి గర్భమున ఉయ్యాలో..

జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో..

అంతలో మునులును ఉయ్యాలో..

అక్కడకు వచ్చిరి ఉయ్యాలో..

కపిల గాలవూల ఉయ్యాలో..

కష్యపాంగ ఋషులు ఉయ్యాలో..

అతి వశిష్టులు ఉయ్యాలో..

ఆకన్నియను చూచి ఉయ్యాలో..

బతుకనీయ తల్లి ఉయ్యాలో..

బతుకమ్మ యనిరంత ఉయ్యాలో..

పిలువగా అతివలు ఉయ్యాలో..

ప్రేమగా తల్లిదండ్రులు ఉయ్యాలో..

బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో..

ప్రజలంత అందురు ఉయ్యాలో..

తాను ధన్యుడంటూ ఉయ్యాలో..

తన బిడ్డతో రాజు ఉయ్యాలో..

నిజ పట్నమునకేగి ఉయ్యాలో..

నేల పాలించగా ఉయ్యాలో..

శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో..

చక్రకుండను పేర ఉయ్యాలో..

రాజు వేషమ్మున ఉయ్యాలో..

రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో..

ఈ ఇంట మునియుండి ఉయ్యాలో..

అతిగా బతుకమ్మను ఉయ్యాలో..

పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో..

పెక్కు మందిని కాంచె ఉయ్యాలో..

ఆరువేల మంది ఉయ్యాలో..

అతి సుందరాంగుల ఉయ్యాలో..

ధర్మాంగుడను రాజు ఉయ్యాలో..

తన భార్య సత్యవతి ఉయ్యాలో..

సిరిలేని సిరులతో ఉయ్యాలో..

సంతోషమెుందిరి ఉయ్యాలో..

జగతిపై బతుకమ్మ ఉయ్యాలో..

శాశ్వతమ్ముగ వెలిసే ఉయ్యాలో..

ఈ పాట పాడినను ఉయ్యాలో..

ఈ పాట విన్నను ఉయ్యాలో..

సౌభాగ్యములనిచ్చు ఉయ్యాలో..

శ్రీ గౌరీ దేవి ఉయ్యాలో..

సిరి సంపదలిచ్చు ఉయ్యాలో..

శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో..

ఘనమైన కీర్తిని ఉయ్యాలో..

శ్రీవాణి ఒసగును ఉయ్యాలో..

ఘనమైన కీర్తిని ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బంగారు బతుకమ్మ ఉయ్యాలో..

సేకరణ : HT Telugu

తదుపరి వ్యాసం