తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Acer Aspire 5 । గేమింగ్ ప్రియుల కోసం ఏసర్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌!

Acer Aspire 5 । గేమింగ్ ప్రియుల కోసం ఏసర్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌!

HT Telugu Desk HT Telugu

30 June 2022, 19:12 IST

    • ఏసర్ తాజాగా Acer Aspire 5 పేరుతో ఓ సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో ఎర్గోనామిక్ డిజైన్, మెటల్ టాప్ కవర్, ఎలివేటింగ్ కీలు ఉన్నాయి. దీని ధర, ఇతర వివరాలను చదవండి..
Acer Aspire 5
Acer Aspire 5

Acer Aspire 5

తైవానీస్ టెక్ కంపెనీ ఏసర్ తాజాగా Acer Aspire 5 పేరుతో ఓ సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ 12వ తరం Intel కోర్ i5 ప్రాసెసర్ ఆధారంగా Nvidia GeForce RTX 2050 GPU ద్వారా శక్తిని పొందుతుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో 8GB RAMని స్టాండర్డ్‌గా ఇస్తున్నారు, దీనిని 32GB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. అలాగే 512 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది, దీనిని 2TB వరకు డ్యూయల్ SSDలకు విస్తరించవచ్చు.

హీట్ పెరగకుండా ఇది డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అదనంగా ఇందులో వివిధ కూలింగ్ మోడ్‌లు, డ్యూయల్-కాపర్ థర్మల్ పైపర్‌లు ఉన్నాయి. ఇవి ఎయిర్ ఇన్‌లెట్ కీబోర్డ్‌ నుంచి 10 శాతం వేడిని బయటకు పంపిస్తాయి.

Acer Aspire 5లో 1,920x1,080 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన 15.6-అంగుళాల ఫుల్-HD IPS డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Acer ComfyView, స్లిమ్ బెజెల్స్‌తో వస్తుంది. దీని స్క్రీన్ 81.18 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, ఏసర్ కలర్ ఇంటెలిజెన్స్, ఏసర్ బ్లూలైట్‌షీల్డ్‌ వంటి క్వాలిటీస్ కలిగి ఉంటుంది.

ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడండి.

Acer Aspire 5 ల్యాప్‌టాప్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 15.6 అంగుళాల ఫుల్ HD IPS LCD డిస్‌ప్లే
  • 8 GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Intel కోర్ i5 12వ-తరం ప్రాసెసర్
  • Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ తగ్గించే Acer PurifiedVoice
  • 720p HD వెబ్‌క్యామ్
  • ఫింగర్ ప్రింట్ స్కానర్‌

మిగతా వివరాలను పరిశీలిస్తే కనెక్టివిటీ కోసం Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, మూడు USB టైప్-A పోర్ట్‌లు, ఒక HDMI 2.0 పోర్ట్‌, Thunderbolt 4 పోర్ట్‌ ఉన్నాయి.

Acer Aspire 5 ప్రారంభ ధర రూ. 62,990/- ఈ ల్యాప్‌టాప్‌ను Amazon India లేదా Acer యొక్క ఏదైనా ఆఫ్‌లైన్ స్టోర్, క్రోమా అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం