తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mutual Funds Sip: నెలకు 10,000 పెట్టుబడి .. 5 సంవత్సరాలలో 12 లక్షల రాబడి!

Mutual funds SIP: నెలకు 10,000 పెట్టుబడి .. 5 సంవత్సరాలలో 12 లక్షల రాబడి!

HT Telugu Desk HT Telugu

12 May 2022, 16:56 IST

    • మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంత రిస్క్‌తో కూడుకున్నప్పటికీ మంచి రాబడులకు అందిస్తాయి. ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ (Invest) చేయడం ద్వారా మూడు, నాలుగు రెట్లు అధికంగా రాబడి పొందే అవకాశం ఉంటుంది
Sip funds
Sip funds

Sip funds

తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలనుకు వారికి మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) ముందు వరుసలో ఉంటాయి. వాటిలో PGIM ఇండియా మిడ్‌క్యాప్  మ్యూచువల్ ఫండ్‌ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్థిరమైన లాభాన్ని పొందవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇవి నష్ట భయం లేకుండా ఈక్విటీ మార్కెట్లకు సమానంగా మెరుగైన రాబడిని ఇస్తుందంటున్నారు. దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇది డెట్ కంటే మెరుగైన రాబడిని ఇస్తుంది. ఈ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఇది తక్కువ నష్ట భయాన్ని కలిగి ఉంటుంది. ఈ మిడ్-క్యాప్ ఫండ్‌ను 2వ డిసెంబర్ 2013న ప్రారంభించారు. అప్పటి నుండి ఈ ఫండ్ మంచి డిమాండ్ ఉంది. 

ట్రెండింగ్ వార్తలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 8 అంకెల మధ్య 3 అంకె దాక్కొని ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టండి

Chicken Chinthamani Recipe : చికెన్ చింతామణి.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి సూపర్

Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

10,000 SIPతో 5 సంవత్సరాలలో 11.98 లక్షలు రాబడి

వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారంగా ఈ మ్యూచువల్ ఫండ్ SIP ప్లాన్‌లో ఒక ఇన్వెస్టర్ నెలకు రూ. 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఒక సంవత్సరంలో రూ. 1.25 లక్షలకు పెరుగే అవకాశం ఉంది. అది 3 సంవత్సరాలకు రూ. 6.49 లక్షలుగా ఉంటుంది. ఇక ఇన్వెస్టర్ 5 సంవత్సరాల పాటు ఈ మ్యూచువల్ ఫండ్  ప్లాన్‌లో నెలకు రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తూ, అది రూ. 11.98 లక్షల వరకు చేరుకుంటుందని వాల్యూ రీసెర్చ్ డేటా తెలిపింది.  PGIM ఇండియా మిడ్‌క్యాప్  ఫండ్-డైరెక్ట్ గ్రోత్ ప్లాన్- కాకుండా కొన్ని ఇతర మిడ్-క్యాప్ ఫండ్‌లు ద్వారా పెట్టుబడిదారులకు మంచి రాబడిని పొందవచ్చు. వాటిలో ఎడెల్వీస్ మిడ్ క్యాప్ డైరెక్ట్, హెచ్‌డిఎఫ్‌సి మిడ్-క్యాప్ , ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్ డైరెక్ట్  ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం