తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Dalit Votes : దళితుల ఓట్ల కోసం బీజేపీ కొత్త వ్యూహాలు ఫలించేనా?

TS Dalit Votes : దళితుల ఓట్ల కోసం బీజేపీ కొత్త వ్యూహాలు ఫలించేనా?

HT Telugu Desk HT Telugu

18 November 2023, 20:56 IST

    • TS Dalit Votes : తెలంగాణ ఎన్నికల్లో దళిత ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. మాదిగ సామాజిక వర్గంపై బీజేపీ ఫోకస్ పెట్టింది.
ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ
ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ

ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ

TS Dalit Votes : తెలంగాణ ఎన్నికల వేల దళిత దంగల్ నడుస్తుంది. ఒకవైపు దళిత బంధు పథకంతో తామే దళితులను ఆదుకున్నామంటూ బీఆర్ఎస్ దళిత ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు బీజేపీ సైతం దళితులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే హైదరాబాద్ లో మాదిగ విశ్వరూప సభ నిర్వహించి ఎస్సీ వర్గీకరణ హామీనిచ్చారు. బీజేపీ అగ్రనేతలు ఎమ్మార్పీఎస్ నేతలతో వరుస భేటీ అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Fact Check: అసదుద్దీన్ ఒవైసీ రాముడి చిత్రపటాన్ని స్వీకరిస్తున్న ఫొటో నిజమైనదేనా?

SIT Report on AP Violence : ఏపీలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక- పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ నేతల పాత్రపై విచారణ!

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

మాదిగలపై బీజేపీ నజర్, రంగంలోకి మందకృష్ణ మాదిగ

ఇదిలా ఉంటే బీసీ సీఎం అంటూ ఇప్పటికే ఉపకులాలకు బీజేపీ గాలం వేసింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సై అంటూ మాదిగ సామాజిక వర్గ ఓటర్లను గుంప గుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఒకపక్క దళిత బందు పథకం వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ వ్యతిరేక దళితులను సైతం బీజేపీ ఆకట్టుకునే చర్యలు చేపడుతుంది. ఇక మాదిగ ఓటర్లను ఎలాగైనా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను బీజేపీ ప్రచారానికి వాడుకునున్నట్లు త్వరలోనే ఆయన ఆధ్వర్యంలో మాదిగ బహిరంగ సభలు మొదలు కానున్నాయని తెలుస్తుంది.

ఇక తెలంగాణలో ఉన్న దళితుల్లో మెజారిటీ వర్గం మాదిగ సామాజిక వర్గం. ఎస్సీ రిజర్వ్ నియోజికవర్గాల్లో మాత్రమే కాకుండా జనరల్ స్థానాల్లో కూడా వారి ప్రభావం ఉంది. అందుకోసమే బీజేపీ మాదిగ ఓటర్లు గాలం వేసే పనిలో ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇటీవలే హైదరబాద్ లో నిర్వహించిన సభలో మోదీ ఎస్సీ వర్గీకరణకు సానుకూలత వ్యక్తం చెయ్యడంతో అదే సభలో మందకృష్ణ మాదిగ తమ మద్దతు బీజేపీకేనని ప్రకటించారు.

బీజేపీ తీరును వ్యతిరేకిస్తున్న కొందరు

ఇదిలా ఉంటే కొందరు మాత్రం మందకృష్ణ మాదిగపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు అన్నీ కాంగ్రెస్ పార్టీకి మాదిగలను దూరం చేసే కుట్రగా కొందరు భావిస్తున్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్నికల ముందే ఎస్సీ వర్గీకరణ గుర్తుకు వచ్చిందా? ఎన్నికల ముందు మాదిగలపై ముసలి కన్నీరు వద్దు అంటూ కొందరు వారి అభిప్రాయలను బయటపెడుతున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం