తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad News : జీహెచ్ఎంసీ పరిధిలో 312 మంది పోటీ, 207 నామినేషన్లు రిజెక్ట్

Hyderabad News : జీహెచ్ఎంసీ పరిధిలో 312 మంది పోటీ, 207 నామినేషన్లు రిజెక్ట్

HT Telugu Desk HT Telugu

15 November 2023, 21:47 IST

    • Hyderabad News : నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 312 మంది బరిలో నిలించారు. 207 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో నామినేషన్లు
జీహెచ్ఎంసీ పరిధిలో నామినేషన్లు

జీహెచ్ఎంసీ పరిధిలో నామినేషన్లు

Hyderabad News : తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ లోని 15 స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. హైదరాబద్ లోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 312 పోటీలో నిలిచారు. మొత్తం 20 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 6 స్థానాలకు అత్యధికంగా 173 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, ఎల్బీ నగర్ లో 38 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్ లో 25 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది, చేవెళ్ల లో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!

Ratan Tata: ఐదో దశ లోక్ సభ పోలింగ్ ముందు ముంబై వాసులకు రతన్ టాటా ప్రత్యేక సందేశం; క్షణాల్లో వైరల్ గా మారిన పోస్ట్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఓటర్ల జాబితా

గ్రేటర్ హైదరాబాద్ తుది ఓటర్ల జాబితా విడుదల అయింది. ఇక్కడ మొత్తం 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. ఇక గ్రేటర్ లో కొత్తగా నమోదు అయిన ఓటర్ల సంఖ్య 77,522 . అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లే ఎక్కువ. ఇక్కడ మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 23,22,623 మంది ఉంటే మహిళా ఓటర్లు 22,13,902 మంది ఉన్నారు.

• మొత్తం ఓటర్లు - 45,36,852

• పురుష ఓటర్లు - 23,22,623

• మహిళా ఓటర్లు - 22,13,902

• కొత్త ఓటర్లు - 77,522

• సర్వీస్ ఓటర్లు - 404

• వయో వృద్ధుల ఓటర్లు - 80,037

• ట్రాన్స్ జెండర్ ఓటర్లు - 327

• దివ్యంగా ఓటర్లు - 20,207

• ఎన్నారై ఓటర్లు - 883

గ్రేటర్ లో 207 నామినేషన్లు తిరస్కరణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు ఏకంగా 207 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ లో 71 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 608 నామినేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సతీమణి జామున నామినేషన్లను తిరస్కరించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం