తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cash In Car Doors: కారు డోర్‌లో క్యాష్.. కోట్లలో పట్టుబడిన నగదు

Cash In Car doors: కారు డోర్‌లో క్యాష్.. కోట్లలో పట్టుబడిన నగదు

Sarath chandra.B HT Telugu

23 November 2023, 12:13 IST

    • Cash In Car doors: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణలో మాత్రమే అత్యధికంగా నగదు  పట్టుబడుతోంది. 
పోలీసులు సీజ్ చేసిన నగదు
పోలీసులు సీజ్ చేసిన నగదు

పోలీసులు సీజ్ చేసిన నగదు

Cash In Car doors: పోలీసులకు పట్టుబడకుండా నగదు తరలింపుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడుతూనే ఉంది. బుధవారం రాత్రి కారు డోర్లలో దాచి తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. ఒక్క రోజే రూ.3.20కోట్ల నగదును శివార్లలో పట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!

హయత్ నగర్, నాచారం పోలీసుస్టేషన్ల పరిధిలో బుధవారం అర్థరాత్రి పోలీసులు రూ.3.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్‌పేట సదాశివ్ ఎన్ క్లేవ్ నుంచి భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఔటర్ రింగ్‌ రోడ్డు సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు.

ఓ కారు డిక్కిలో చేతి సంచుల్లో ఉన్న రూ.2కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. హయత్‌ నగర్‌కు చెందిన శివకుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి, తాటికొండ మహేందర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, రమేష్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. పట్టుబడిన నగదును చౌటుప్పల్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించినట్టు ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వర్రావు తెలిపారు.

ఎల్పీ నగర్, కొత్తపేటకు చెందిన బండి సుధీర్ రెడ్డి పాత కార్లు విక్రయిస్తుంటారు. బుధవారం కారులో భువనగిరి వెళ్తుండగా నాచారంలో పోలీసులు తనిఖీలు చేశారు. కారు ముందు డోర్లు పచ్చినంత సులువుగా వెనుక డోర్లు రాక పోవడంతో అనుమానించిన పోలీసులు వాటిని తెరిచి తనిఖీలు చేశారు.

కారు డోర్ల లోపలి భాగంలో రూ.1.20 కోట్ల నగదు బయట పడింది. హబ్సిగూడలోని లక్ష్మారెడ్డి నుంచి డబ్బు తీసుకొస్తున్నట్లు గుర్తించినట్టు మల్కాజ్‌గిరి అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. నగదు తరలింపుపై విచారణ జరుపుతున్నారు.

తదుపరి వ్యాసం