తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Gangula On Bandi: బండికి ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేక ఎమ్మెల్యేగా పోటీ - గంగుల

Gangula on Bandi: బండికి ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేక ఎమ్మెల్యేగా పోటీ - గంగుల

HT Telugu Desk HT Telugu

21 November 2023, 8:50 IST

    • Gangula on Bandi: ఎన్నికల్లో సానుభూతి మాయమాటలు చెప్పి హాస్పిటల్ డ్రామాలు ఆడే డ్రామా ఆర్టిస్ట్ బండి సంజయ్ అని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ మండి పడ్డారు. 
ఎన్నికల ప్రచారంలో గంగుల కమలాకర్
ఎన్నికల ప్రచారంలో గంగుల కమలాకర్

ఎన్నికల ప్రచారంలో గంగుల కమలాకర్

Gangula on Bandi: కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్, ఎలబోతారం గ్రామాలలో గంగుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, ఒగ్గు కళాకారుల నృత్యాల మధ్య గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

ట్రెండింగ్ వార్తలు

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

ప్రజలకు సేవ చేయడానికి బండి సంజయ్ ని కరేంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే నాలుగున్నరేళ్లు పత్తా లేకుండా పోయి..అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు వస్తున్నాడని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ఎంపీగా టికెట్ వచ్చే అవకాశం లేకనే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కో ఓటుకు ఇరవై వేల రూపాయలతో పాటు సెల్ ఫోన్ ఇవ్వడానికి సిద్దం అయ్యాడని,అక్రమంగా సంపాదించిన డబ్బులను ఎరచూపడానికి వస్తున్న సంజయ్ ఇచ్చే డబ్బులను తీసుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

నాలుగున్నరేళ్లుగా ఎంపీగా సంజయ్ ఏమి అభివృద్ధి చేశాడో గ్రామాల్లోని మహిళలు నిలదీయాలన్నారు.యాభై ఏళ్ల దరిద్రానికి కారణం బీజేపీ కాంగ్రెస్ లేనని, యాభై ఏళ్ల దరిద్రం కోరుకుందామా..పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి కోరుకుందామా ఆలోచించుకోవాలన్నారు.

పచ్చని తెలంగాణ పై ఆంధ్రోళ్ల కన్ను పడిందని మరోసారి తెలంగాణ పై ఆధిపత్యం కోసం కుట్రలు పన్నుతున్నారని..కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, పదేళ్ల అభివృద్ధి పై గ్రామాల్లో చర్చించాలని కోరారు...కేసీఆర్ లేని తెలంగాణా రాష్ట్రాన్ని ఊహించలేమని ప్రతిఒక్కరు బీఆర్ఎస్ కు ఓటేసి బలపరిస్తేనే బంగారు తెలంగాణా సాధ్యమన్నారు.

(రిపోర్టర్ గోపికృష్ణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

తదుపరి వ్యాసం