తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bandi Sanjay: పైసలు లేవంటున్నారు, రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్

Bandi Sanjay: పైసలు లేవంటున్నారు, రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

23 April 2024, 12:08 IST

    • Bandi Sanjay: తరుగు, తాలు, తేమతో సంబంధం లేకుండా ప్రతి గింజనూ కొంటామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్​ నేతలు.. రూ.700 కోట్లు ఖర్చు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, 30 వేల కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ప్రశ్నించారు.
రైతు రుణమాఫీ  ఎలా చేస్తారని ప్రశ్నించిన బండి  సంజయ్
రైతు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్

రైతు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్

Bandi Sanjay: తాలు, తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తే తెలంగాణలో Paddy ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, క్వింటాకు రూ.500 బోనస్​ Bonus ఇస్తే రూ.5 వేల కోట్ల అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని బండి సంజయ్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : సిద్దిపేటలో విషాదం, ఓటు వేసి ప్రాణం విడిచిన వృద్ధురాలు

Mulugu News : ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల కాలినడక, ఆదర్శం పెనుగోలు గిరిజనులు

Jagtial News : చిన్నకోల్వాయి ఓటర్లకు హ్యాట్సాఫ్, వందశాతం పోలింగ్ నమోదు

AP Polling : ఏపీలో ముగిసిన పోలింగ్, పలు ప్రాంతాల్లో ఘర్షణలు, బాంబు దాడులు- రీపోలింగ్ కు నో ఛాన్స్ అన్న సీఈవో

రైతుల Farmers కోసం రూ.5,700 కోట్లు ఖర్చు పెట్టాల్సిన కాంగ్రెస్​ నాయకులు పైసలు లేవని అంటున్నారని, అలాంటప్పుడు 30 వేల కోట్ల ఖర్చుతో 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని మండిపడ్డారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సోమవారం బండి సంజయ్​ పరిశీలించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ బైబిల్​, ఖురాన్​, భగవద్గీతతో పాటు దేవుళ్ల మీద ఒట్టేసి తరుగు, తాలు, తేమతో సంబంధం లేకుండా ప్రతి గింజను కొంటామనిCongress Govt కాంగ్రెస్​ నేతలు చెప్పారన్నారు.

తడిచిన ధాన్యం నెపంతో 6 నుంచి 10 కిలోల కోత పెడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు బైబిల్​, భగవద్గీత, ఖురాన్​ దేవుళ్ల మీద కాంగ్రెస్​ నేతలకు విశ్వాసం ఉన్నట్టా! అని ప్రశ్నించారు. రైతు సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్​ ప్రభుత్వం పవిత్ర గ్రంథాలను అవమానపరిచినట్టేనన్నారు.

తడిచిన ప్రతి గింజనూ కొనాలి…

అకాల వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో ధాన్యం తడిసిందని, రైతు పండించిన ప్రతి గింజను కొనాల్సిన Paddy Procurement బాధ్యత ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్​ అన్నారు. ధాన్యం తడిసిందని తెలిసిన వెంటనే దళారులు ఆరు నుంచి 10 కిలోల వరకు కోత పెడుతున్నారని, ప్రభుత్వం దీనిపై సీరియస్​ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులు తాలు లేకుండా చేసినా క్వింటాకు ఆరు కిలోల వరకు కోత పెడుతున్నారని, కానీ ప్రభుత్వం ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. గంపగుత్తగా 6 కిలోల కోత అనేది రైతులకు అలవాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.

గత బీఆర్ఎస్​ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్​ ​ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్​ ప్రభుత్వం పండించిన ప్రతిగింజనూ కొనాలని, బైబిల్​, ఖురాన్​, భగవద్గీతలపై నమ్మకం ఉంటే.. వాటిలో దేవుడు కనపడితే కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం…

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బండి సంజయ్​ అన్నారు. ఇందులో భాగంగానే కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాకముందు 2014లో మద్దతు ధర కేవలం 1,310 మాత్రమే ఉండేదని, గత పదేండ్ల పాలనలో మద్దతు ధరను 2,200కు పెంచారని ​ అన్నారు.

గత బీఆర్​ఎస్​, ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం రైతు నడ్డీ విరిచేస్తున్నాయని మండిపడ్డారు. యూరియా, డీఏపీ లాంటి ఎరువులకు సబ్సిడీలు ఇచ్చేది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని, మోదీ మరోసారి ప్రధాని కాకుంటే సబ్సిడీలను ఎత్తివేసే ప్రమాదం ఉందని బండి సంజయ్​ స్పష్టం చేశారు.

తద్వారా ఒక్కో రైతుపై ఎకరాకు 22 వేలకుపైగా అదనపు భారం పడే అవకాశం ఉందని, రైతుల ఇబ్బందులు తొలగాలంటే కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వాన్నే తీసుకురావాలని పిలుపునిచ్చారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం