తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ci Suspension: వరంగల్‌ సిఐపై ఈసీ సస్పెన్షన్ వేటు

CI Suspension: వరంగల్‌ సిఐపై ఈసీ సస్పెన్షన్ వేటు

Sarath chandra.B HT Telugu

29 November 2023, 8:41 IST

    • CI Suspension: మేడిపల్లిలో నగదుతో పట్టుబడిన వరంగల్ జిల్లా సిఐపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మంగళవారం కాంగ్రెస్‌ నాయకులు దాడి చేసి నగదు తీసుకు వెళుతున్న సిఐను పట్టుకున్నారు. 
సిఐపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు
సిఐపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు

సిఐపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు

CI Suspension: హైాదరాబాద్‌ శివార్లలో చెంగిచర్లలో నగదుతో పట్టుబడిన పోలీస్ అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ నుంచి కారులో నగదు తరలిస్తున్న సిఐ అంజిత్ రావును కాంగ్రెస్ శ్రేణులు చెంగిచర్ల క్రాస్ రోడ్డులో అడ్డగించాయి.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!

Ratan Tata: ఐదో దశ లోక్ సభ పోలింగ్ ముందు ముంబై వాసులకు రతన్ టాటా ప్రత్యేక సందేశం; క్షణాల్లో వైరల్ గా మారిన పోస్ట్

పక్కా సమాచారంతో వాహనాన్ని అడ్డగించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందులో భారీగా నగదు గుర్తించారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తీసుకు వస్తున్నారని గుర్తించారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం అందడంతో సిఐ అంజిత్ రావు వాహనాన్ని చెంగిచర్ల క్రాస్ రోడ్డులో కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు.

తన వ్యక్తిగత అవసరాల కోసం నగదు తీసుకువెళుతున్నానని చెప్పినా, వాహనాన్ని తనిఖీ చేయడంతో పోలీస్ ఐడీ కార్డు దొరకడంతో అతనిపై దాడి చేశారు. మంత్రి మల్లారెడ్డి కోసం నగదు తరలిస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ క్రమంలో సిఐపై దాడి చేశారు.

కారులో నగదు పట్టుబడిన విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న బలగాలు కారుతో పాటు సిఐను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్‌కు నివేదికను ఇవ్వడంతో అతనిపై చర్యలు తీసుకున్నాయి.

ఎన్నికల విధుల్లో ఉండాల్సిన సిఐ అంజిత్ రావు హైదరాబాద్ ఎందుకు వచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా నగదు తరలించడానికి సిఐ కారులో వచ్చారని గుర్తించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల తనిఖీల నుంచి తప్పించుకున్నారని భావిస్తున్నారు. వరంగల్ నుంచి పలు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను దాటేందుకు సిఐ సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రాథమిక నివేదిక ఆదారంగా సిఐపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.

తదుపరి వ్యాసం