తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cpi Telangana Manifesto : సీపీఐ మేనిఫెస్టో విడుదల....పేదల ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు

CPI Telangana Manifesto : సీపీఐ మేనిఫెస్టో విడుదల....పేదల ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు

HT Telugu Desk HT Telugu

09 November 2023, 13:57 IST

    • Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను ప్రకటించింది సీపీఐ. ఇళ్లు లేని పేదలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - సీపీఐ మేనిఫెస్టో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - సీపీఐ మేనిఫెస్టో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - సీపీఐ మేనిఫెస్టో

CPI Telangana Manifesto 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ దూకుడు పెంచింది. బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విడుదల చేశారు.కాగా సీపీఐ పార్టీ మేనిఫెస్టో లో కీలక హామీలను పొందుపర్చారు.ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద,మధ్య తరగతి ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,కేరళ రాష్ట్రం తరహాలో 12 రకాల రేషన్ అందిస్తామని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

ఇళ్లు లేని పేదలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

ఇళ్లు లేని పేదలందరికీ ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని నారాయణ వెల్లడించారు. కాళేశ్వరం లో నిర్మాణ లోపాలు ,అవినీతి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణ తెలిపారు.విద్యారంగానికి బడ్జెట్ లో 10 శాతం నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్,సీపీఐ అభ్యర్థులను బాలపరుచాలని నారాయణ కోరారు.కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే.పొత్తులో భాగంగా కొత్తగూడెం టికెట్ సీపీఐ కి కేటాయించి,అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీ ల హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

మేనిఫెస్టో లోని పలు కీలక హామీలు

• తెలంగాణ అమరవీరుల కుటుంబ సంక్షేమం కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు.

• పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి.

• విద్య,వైద్యం తో పాటు విద్యుత్ రంగానికి ప్రాధాన్యత.

• వ్యవసాయ కార్మికులకు సాగుభుమి పంపిణీ.

• దళితులకు ప్రభుత్వ నిధులతో సొంత కాలనీల నిర్మాణం.

• కార్మికులకు కావాల్సిన సదుపాయాలు కల్పించడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ.

• కులాంతర,మతాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రత్యేక రక్షణ కల్పన.

• చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణమే అమలు.

• మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ల కల్పన.

• గీత కార్మికులకు వెయ్యి గజాల వ్యవసాయ భూమి కేటాయింపు.

రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం