తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp: వాట్సాప్ అందిస్తున్న ‘ఫ్రీ గూగుల్ స్టోరేజ్’ గడువు ముగుస్తోంది.. మీ డేటాను ఇలా సేవ్ చేసుకోండి

WhatsApp: వాట్సాప్ అందిస్తున్న ‘ఫ్రీ గూగుల్ స్టోరేజ్’ గడువు ముగుస్తోంది.. మీ డేటాను ఇలా సేవ్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

02 January 2024, 13:05 IST

  • WhatsApp news: వినియోగదారులకు గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ ను ఉచితంగా అందించే సదుపాయాన్ని వాట్సాప్ తొలగించనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp news: 2024 నాటికి ఉచిత గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ సదుపాయాన్ని వాట్సాప్ తొలగించాలని నిర్ణయించింది. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఫొటోలు, వీడియోలతో సహా వారి చాట్ హిస్టరీని నిల్వ చేయడానికి అందించే ఉచిత గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ స్పేస్ ముగింపు పలుకుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

15 జీబీ వరకు..

ఇకపై 15 జీబీ స్టోరేజ్ పరిమితి మాత్రమే వాట్సాప్ వినియోగదారులకు లభించనుంది. లేదా, వినియోగదారులు గూగుల్ వన్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ డివైజెస్ లో వాట్సాప్ బ్యాకప్ లను త్వరలో మీ గూగుల్ ఖాతా క్లౌడ్ స్టోరేజ్ పరిమితి మేరకు మాత్రమే అందిస్తారు. ఇతర మొబైల్ ప్లాట్ ఫామ్స్ లో వాట్సాప్ బ్యాకప్ లను ఎలా నిర్వహిస్తారో, ఇకపై ఆండ్రాయిడ్ డివైజెస్ లో కూడా బాక్ అప్ మేనేజ్ మెంట్ అలాగే ఉండనుంది. ఈ మార్పు మొదట డిసెంబర్ 2023 నుంచి వాట్సాప్ బీటా వినియోగదారులకు, తరువాత వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి ఇతర ఆండ్రాయిడ్ వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.

30 రోజుల ముందుగానే..

ఈ కొత్త మార్పులు 2024 నాటికి యూజర్లందరికీ అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ సెట్టింగ్స్> చాట్స్ > చాట్ బ్యాకప్ బ్యానర్ లో 30 రోజుల ముందుగానే యూజర్లకు ఈ విషయం తెలియజేయడం ప్రారంభిస్తామని వాట్సాప్ తెలిపింది.

గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్

15 జీబీ స్టోరేజ్ పరిమితిని దాటిన వాట్సాప్ వినియోగదారులు తమ బ్యాక్ అప్ ను గూగుల్ వన్ కు సబ్ స్క్రైబ్ చేసుకుని భద్రపర్చుకోవచ్చు. వినియోగదారులు ఆండ్రాయిడ్ పరికరాల మధ్య ఈ ఫైళ్లను బదిలీ చేసుకోవచ్చు. ఉదాహరణకు, తమ వాట్సాప్ చాట్స్ ను గూగుల్ అక్కౌంట్స్ లో నిల్వ చేయడానికి ఆసక్తి లేని వినియోగదారులు కొత్త ఆండ్రాయిడ్ కు మారినప్పుడు వాట్సాప్ చాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. గూగుల్ అందిస్తున్న 15 జీబీతో పోలిస్తే ఆపిల్ తన నాన్ పేయింగ్ యూజర్లకు 5 జీబీ ఉచిత స్టోరేజీని మాత్రమే అందిస్తుంది.

తదుపరి వ్యాసం