తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tcs Ends Wfh Policy: టీసీఎస్ కీలక నిర్ణయం; ‘వర్క్ ఫ్రం హోం’ కు స్వస్తి

TCS ends wfh policy: టీసీఎస్ కీలక నిర్ణయం; ‘వర్క్ ఫ్రం హోం’ కు స్వస్తి

HT Telugu Desk HT Telugu

30 September 2023, 11:04 IST

  • TCS ends WFH policy: ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Abhijit Bharlekar/Mint file photo)

ప్రతీకాత్మక చిత్రం

TCS ends WFH policy: అక్టోబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులు కచ్చితంగా వారానికి ఐదు రోజులు ఆఫీస్ కు రావాల్సిందేనని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్పష్టం చేసింది. ఇక నుంచి వర్క్ ఫ్రం హోం విధానం కానీ, హైబ్రిడ్ విధానం కానీ ఉండబోదని ఉద్యోగులకు మెయిల్ ద్వారా తేల్చిచెప్పింది. వారంలో కొన్ని రోజులు ఆఫీస్ కు వెళ్లి పని చేస్తూ, మరికొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే విధానాన్నే హైబ్రిడ్ విధానం అంటారు.

కోవిడ్ 19 తో..

అకస్మాత్తుగా ముంచుకువచ్చిన కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానం ప్రారంభమైంది. కోవిడ్ సమస్య సద్దు మణిగిన తరువాత కూడా చాలా కంపెనీలు ఈ వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించాయి. ఆ తరువాత క్రమంగా హైబ్రిడ్ విధానాన్ని అవలంబించాయి. ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ఆఫీస్ లకు వెళ్లి పని చేసే సిస్టమ్ ను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే, టీసీఎస్ (TCS) కూడా ఇకపై పూర్తి స్థాయిలో ఆఫీస్ వర్క్ సిస్టమ్ ను ప్రారంభించాలని నిర్ణయించింది. వారంలో పూర్తిగా ఐదు రోజుల పాటు కచ్చితంగా ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందేనని స్పష్టం చేస్తూ వారికి మెయిల్స్ పంపించింది.

ఏది బెటర్?

వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మొదట ఉద్యోగులు స్వాగతించినప్పటికీ.. క్రమంగా ఆ విధానంలోని ఇబ్బందులను, సమస్యలను గుర్తించి ఆఫీస్ లకు వచ్చి పని చేయడంపైననే ఆసక్తి చూపుతున్నారు. ఆఫీస్ లకు వెళ్లడం వల్ల క్రమబద్ధమైన వర్కింగ్ అవర్స్ విధానం ఉంటుందని, సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడ్తాయని భావిస్తున్నారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల కొన్ని పే బెనిఫిట్స్ ను కోల్పోతున్నామని తెలిపారు. టీసీఎస్ కూడా మొదట్నుంచీ వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్నే ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల మధ్య వర్చువల్ సంబంధాల కన్నా, వ్యక్తిగతంగా ఉండే సంబంధాల వల్ల ఉద్యోగులకు, సంస్థకు లాభదాయకమని టీసీఎస్ వార్షిక నివేదికలో కూడా పేర్కొంది. భారత్ లోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో టీసీఎస్ కూడా ఒకటి. ఈ సంస్థలో 2023 మార్చి నాటికి సుమారు 6 లక్షల మంది ఉద్యోగులున్నారు.

తదుపరి వ్యాసం