తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Easy Upgrades: ‘‘ఈజీ అప్ గ్రేడ్స్’’ ప్లాట్ ఫామ ను ప్రారంభించిన వన్ ప్లస్

OnePlus Easy Upgrades: ‘‘ఈజీ అప్ గ్రేడ్స్’’ ప్లాట్ ఫామ ను ప్రారంభించిన వన్ ప్లస్

HT Telugu Desk HT Telugu

03 February 2024, 14:37 IST

  • OnePlus Easy Upgrades: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మరో మైలురాయిని చేరుకుంది. వినియోగదారులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా, వారికి వన్ ప్లస్ సేవలు మరింత సులువుగా అందించడానికి వన్ ప్లస్ ఈజీ అప్ గ్రేడ్స్ (OnePlus Easy Upgrades) ను ప్రారంభించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మరో మైలురాయిని చేరుకుంది. వినియోగదారులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా, వారికి వన్ ప్లస్ సేవలు మరింత సులువుగా అందించడానికి వన్ ప్లస్ ఈజీ అప్ గ్రేడ్స్ (OnePlus Easy Upgrades) ను ప్రారంభించింది.

వన్ ప్లస్ ఈజీ అప్ గ్రేడ్స్

ఈ వన్ ప్లస్ ఈజీ అప్ గ్రేడ్స్ (OnePlus Easy Upgrades) ప్లాట్ ఫామ్ ద్వారా వినియోగదారులు వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్స్, ఇతర వన్ ప్లస్ డివైజెస్ ను ఆన్ లైన్ లో సబ్ స్క్రిప్షన్ విధానంలో సులువుగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా వినియోగదారుడు స్మార్ట్ ఫోన్ ధరలో కొంత మొత్తాన్ని మాత్రం చెల్లించి, ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇందుకు గానూ, వన్ ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మిగతా మొత్తాన్ని సులువైన వాయిదాల్లో కానీ, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ల ద్వారా కానీ చెల్లించవచ్చు.

అస్యూర్డ్ బై బ్యాక్..

ఈ విధానంలో వినియోగదారుడికి బై బ్యాక్ హామీని కూడా వన్ ప్లస్ ఇస్తుంది. వినియోగదారులు తాము ఉపయోగిస్తున్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను బై బ్యాక్ విధానం ద్వారా లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ తో అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఒకేసారి మొత్తం ధర చెల్లించాల్సిన అసవరం లేకుండా, వీలైన మొత్తంలో డబ్బు చెల్లించి, వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ను, వన్ ప్లస్ డివైజెస్ ను సొంతం చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం