తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Crash: స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలుతోంది? ఈ బ్లడ్ బాత్ కు కారణం ఏంటి?

Stock market crash: స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలుతోంది? ఈ బ్లడ్ బాత్ కు కారణం ఏంటి?

HT Telugu Desk HT Telugu

26 October 2023, 13:33 IST

  • Stock market crash: ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు గత ఆరు రోజులుగా స్టాక్ మార్కెట్ చుక్కలు చూపిస్తోంది. గంటల వ్యవధిలో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది. ఈ స్థాయిలో మార్కెట్లు పడిపోవడానికిి కారణమేంటి?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Stock market crash: గత ఆరు సెషన్స్ లో బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) దాదాపు 3 వేల కు పైగా పాయింట్లను నష్టపోయింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో బీఎస్ఈ నష్టపోలేదు. గురువారం ఉదయం కూడా 63,774 పాయింట్లతో ప్రారంభమై, సెషన్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే 63,403 పాయింట్ల ఇంట్రా డే కనిష్టానికి దిగజారింది. గత ఆరు సెషన్స్ లో సెన్సెక్స్ 66,428 పాయింట్ల నుంచి 63,403 పాయింట్లకు దిగజారింది. అంటే, దాదాపు 3 వేల కు పైగా పాయింట్లను నష్టపోయింది. నిఫ్టీ 50 (Nifty 50) కూడా గురువారం ఇంట్రా డే కనిష్టం అయిన 18,920 పాయింట్లకు చేరింది. అదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 42,371 కనిష్టానికి చేరింది.

Israel-Hamas war: ఇజ్రాయెల్ - హమాస్

స్టాక్ మార్కెట్లలో ఈ బ్లడ్ బాత్ కు ప్రధాన కారణం తీవ్రమవుతున్న ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధమని (Israel-Hamas war) మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వారి విశ్లేషణ ప్రకారం.. మరికొన్ని రోజుల పాటు స్టాక్ మార్కెట్లలో ఈ నెగటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం మరింత తీవ్రమై, మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తున్న నేపథ్యంలో.. అనూహ్య లోతులకు స్టాక్స్ సూచీలు పడిపోయే ముప్పు కనిపిస్తోంది. ఈ యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ యుద్ధం మరింత విస్తృతమై, మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ కు ఇజ్రాయెల్ సిద్ధమువుతోంది. ఇవన్నీ భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

US Treasury yield: యూఎస్ ట్రెజరీ బాండ్స్

యూఎస్ ట్రెజరీ బాండ్స్ విలువ 16 ఏళ్ల ఆల్ టైం గరిష్టానికి చేరింది. దాంతో, ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న యూఎస్ ట్రెజరీ బాండ్స్ ను పెద్ద ఎత్తున అమ్మేయడం ప్రారంభించారు. ఈ అమ్మకాల ఒత్తిడి వల్ల కూడా స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. అంతేకాకుండా, స్టాక్ మార్కెట్లు మరింత కుప్పకూలే ప్రమాదం ఉందన్న భయంతో ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియోలలోని రిస్కీ స్టాక్స్ ను అమ్మడం ప్రారంభించారు. అంతేకాకుండా, ఒవరాల్ గా తమ స్టాక్స్ విలువ గణనీయంగా తగ్గించాలనుకుంటున్నారు. గత నాలుగు రోజుల్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,200 పాయింట్లకు పైగా క్షీణించగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1,950 పాయింట్లు పడిపోయింది. ఇవి కాకుండా, గత కొన్ని వారాలుగా US డాలర్ విలువ పెరుగుతూ ఉండటంతో FIIల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ నెలలో, 25 అక్టోబర్ నాటికి రూ. 17,396 కోట్ల విలువైన స్టాక్‌లను ఎఫ్ఐఐ (FII) లు విక్రయించారు. బుధవారం సెషన్‌లో, ఎఫ్ఐఐ లు 4,236 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

తదుపరి వ్యాసం