తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sbi Amrit Kalash: ఎస్బీఐ అమృత కలశ్ ఎఫ్ డీ స్కీమ్ పొడిగింపు; మంచి వడ్డీ అందించే స్కీమ్ ఇది..

SBI Amrit Kalash: ఎస్బీఐ అమృత కలశ్ ఎఫ్ డీ స్కీమ్ పొడిగింపు; మంచి వడ్డీ అందించే స్కీమ్ ఇది..

HT Telugu Desk HT Telugu

17 August 2023, 11:59 IST

  • SBI Amrit Kalash: అమృత కలశ్ ఎఫ్ డీ స్కీమ్ ని పొడిగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ లో ఈ అమృత కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ చాలా పాపులర్ అయింది. దాంతో ఈ స్కీమ్ ని డిసెంబర్ 31, 2023 వరకు పొడిగించాలని బ్యాంక్ నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SBI Amrit Kalash: అమృత కలశ్ ఎఫ్ డీ స్కీమ్ ని పొడిగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ లో ఈ అమృత కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ చాలా పాపులర్ అయింది. దాంతో ఈ స్కీమ్ ని డిసెంబర్ 31, 2023 వరకు పొడిగించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఈ స్కీం ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి 7.1 నుంచి 7.6 వరకు వార్షిక వడ్డీ రేటు లభిస్తుది. డిపాజిటర్ల నుంచి ఈ స్కీమ్ కి మంచి స్పందన లభిస్తున్న కారణంగా ఈ పథకాన్ని ఎస్బీఐ ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న ఈ అమృత కలర్స్ ఎఫ్ డీ స్కీమ్ ని ఎస్బీఐ ప్రారంభించింది. 400 రోజుల గడువుతో ఈ స్కీం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

7.1% నుంచి 7.6% వరకు..

ఈ అమృత కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ కు సాధారణ కస్టమర్లకి 7.1% వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజెన్లకి 7.6% వడ్డీ లభిస్తుంది. వడ్డీని నెలవారీగా లేదా మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి, కస్టమర్ల కోరిక మేరకు బ్యాంక్ కస్టమర్ల ఖాతాలో జమ చేస్తుంది. ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • 7 నుంచి 45 రోజులకి - 3%
  • 46 నుంచి 179 రోజులకు - 4.5%
  • 180 నుంచి 210 రోజులకు - 5.25%
  • 211 నుంచి సంవత్సరంలోపు - 5.75%
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు - 6.8%
  • 2 నుంచి మూడేళ్ల లోపు - 7%
  • 3 నుంచి 10 సంవత్సరాల లోపు - 6.5% వడ్డీ లభిస్తుంది.
  • అమృత కలశ్ స్కీం డిపాజిట్లకు మాత్రం 400 రోజులకు గాను 7.1% వార్షిక వడ్డీ లభిస్తుంది.
  • పైన పేర్కొన్న అన్ని వడ్డీరేట్లకి 0.5% అదనంగా సీనియర్ సిటిజనులకు లభిస్తుంది.

తదుపరి వ్యాసం