తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi 13c 5g Launch: ఇండియన్ మార్కెట్లోకి రెడ్ మి 13 సీ 5జీ; ఫీచర్స్, ధర.. ఇతర వివరాలు ఇవే..

Redmi 13C 5G launch: ఇండియన్ మార్కెట్లోకి రెడ్ మి 13 సీ 5జీ; ఫీచర్స్, ధర.. ఇతర వివరాలు ఇవే..

HT Telugu Desk HT Telugu

06 December 2023, 15:13 IST

  • Redmi 13C 5G launch: కొన్ని నెలల నిరీక్షణ తర్వాత, షావోమీ ఎట్టకేలకు  రెడ్ మి 13 సీ 5జీ (Redmi 13C 5G) ని భారతదేశంలో లాంచ్ చేసింది, దేశంలో 5 జీ టెక్నాలజీని మరింత విస్తృతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. డిసెంబర్ 16 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి.

రెడ్ మి 12 సీ 5 జీ స్మార్ట్ ఫోన్
రెడ్ మి 12 సీ 5 జీ స్మార్ట్ ఫోన్ (Xiaomi)

రెడ్ మి 12 సీ 5 జీ స్మార్ట్ ఫోన్

Redmi 13C 5G launch: అందుబాటు ధరలో, అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ (Features) తో లభించే స్మార్ట్ ఫోన్ అంటే గుర్తొచ్చే కంపెనీ షావోమీ (Xiaomi). ఇప్పుడు తాజాగా రెడ్ మి 13 సీ 5జీ (Redmi 13C 5G) పేరుతో మరో 5 జీ టెక్నాలజీ అఫర్డబుల్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Mahindra XUV 3XO bookings: రేపటి నుంచే మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం; ఇలా బుక్ చేసుకోండి..

Vivo X100 Ultra: ఇది ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసమే.. 200 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్ ఫోన్

High dividend stocks: అదిరిపోయే డివిడెండ్ తో పాటు షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతున్న 5 స్టాక్స్ ఇవి..

Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

Features: ఫీచర్స్

ఈ లేటెస్ట్ Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ రక్షణ ఉంటుంది. ఇందులో MediaTek డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్ ను అమర్చారు. ఇందులో 8GB RAM, 256GB స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటుంది. అదనంగా, మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ ను విస్తరించవచ్చు. అలాగే, ర్యామ్ ను కూడా 16GB వరకు వర్చువల్ గా పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP ప్రైమరీ షూటర్‌తో AI డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

మూడు రంగుల్లో..

ఈ షావోమీ 13 సీ 5 జీ ఫోన్ బ్లాక్, సిల్వర్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఇందులో సైడ్-మౌంటెడ్ క్విక్ అన్‌లాక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. అలాగే, ఇందులో 5000mAh బ్యాటరీ, USB టైప్-C పోర్ట్‌, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ రెడ్ మి 13C 5G స్మార్ట్ ఫోన్ సేల్ డిసెంబర్ 16 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని Mi.com, ఆమెజాన్, షావోమీ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

Redmi 13C 5G Price: ధర

Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ కు ప్రత్యేక లాంచ్ ధర రూ. 9999 కాగా, 6 GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11499 గా ఉంది. అదే సమయంలో, టాప్ వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13499 గా నిర్ణయించారు. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 1000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

తదుపరి వ్యాసం