తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Sim Card Rules: ఈ రోజు నుంచి సిమ్ కార్డ్ రూల్స్ మారుతున్నాయి.. కొత్త రూల్స్ లో రూ. 10 లక్షల జరిమానా కూడా..

New SIM card rules: ఈ రోజు నుంచి సిమ్ కార్డ్ రూల్స్ మారుతున్నాయి.. కొత్త రూల్స్ లో రూ. 10 లక్షల జరిమానా కూడా..

HT Telugu Desk HT Telugu

01 December 2023, 12:16 IST

  • New SIM card rules: ఈ రోజు నుంచి, అంటే, డిసెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ నియమాలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నిబంధనల్లో బల్క్ సిమ్ కార్డ్‌ల అమ్మకంపై నిషేధం, PoS ఏజెంట్లు, పంపిణీదారుల తప్పనిసరి రిజిస్ట్రేషన్ మొదలైనవి ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

New SIM card rules: సిమ్ కార్డుల అమ్మకం, వినియోగాలకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్ట్ నెలలో రూపొందించింది. ఆ నిబంధనలు ఈ డిసెంబర్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఆ రూల్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Registration: 10 లక్షల రూపాయల జరిమానా

కొత్త నిబంధనల ప్రకారం, PoS ఏజెంట్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ లేదా లైసెన్స్‌దారుతో ఒప్పందంపై సంతకం చేయాలి. ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే PoS ఏజెంట్లకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అలాగే, వారి లైసెన్స్ ను మూడేళ్లపాటు రద్దు చేస్తారు.

KYC rules: కేవైసీ నిబంధన

కొత్త నిబంధనల ప్రకారం, కొత్త SIM కార్డ్‌ను కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న నంబర్‌లో కొత్త SIM కోసం దరఖాస్తు చేయడానికి వ్యక్తిగత వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలి. సిమ్ కార్డు తీసుకున్న వ్యక్తికి చెందిన ఆధార్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆ వివరాలను సేకరిస్తారు. ముఖ్యంగా, ఒక మొబైల్ నంబర్ ను డిస్ కనెక్ట్ చేసిన 90 రోజుల తర్వాత మాత్రమే ఆ మొబైల్ నంబర్ కొత్త కస్టమర్‌కు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే, SIM రీప్లేస్‌మెంట్ కోసం సబ్‌స్క్రైబర్ మొత్తం KYC ప్రక్రియను మళ్లీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, కొత్త సిమ్ యాక్టివేట్ అయిన తరువాత 24 గంటల పాటు అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ SMS సౌకర్యాలు ఉండవు.

Bulk buying of SIMs: సిమ్ కార్డుల బల్క్ కొనుగోళ్లపై నిషేధం

సిమ్ కార్డులను ఒకేసారి పెద్ద సంఖ్య లో అమ్మడాన్ని (bulk sale of SIM cards) ప్రభుత్వం నిషేధించింది. ఒక ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. అలాగే, వాణిజ్య, వ్యాపార, కార్పొరేట్ క్లయింట్లకు ఈ నిషేధం నుంచి మినహాయింపును ఇచ్చింది. అయితే, అలా బల్క్ గా సేల్ చేసిన సిమ్ కాార్డును తమ ఉద్యోగులకు కేటాయించినప్పుడు, ఆయా సంస్థలు వారి కేవైసీ వివరాలను కచ్చితంగా సేకరించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం